Share News

కేంద్రమంత్రి పెమ్మసాని హీరోగా సినిమా.. రాఘవేంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Oct 18 , 2026 | 08:42 PM

కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హీరో, నిర్మాతగా ఓ సినిమా చేయాలని తాను భావిస్తున్నానని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు పేర్కొన్నారు. పెమ్మసాని ముందుకు వస్తే తాను సినిమా చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

కేంద్రమంత్రి పెమ్మసాని హీరోగా సినిమా.. రాఘవేంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు
Director Raghavendra Rao

విజయవాడ, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హీరో, నిర్మాతగా ఓ సినిమా చేయాలని తాను భావిస్తున్నానని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు (Director Raghavendra Rao) పేర్కొన్నారు. పెమ్మసాని ముందుకు వస్తే తాను సినిమా చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. విజయవాడ ఉత్సవ్ 2.0 వేదికపైకి వచ్చాక తనకు ఓ మూవీ స్టోరీ ఆలోచన వచ్చిందని తెలిపారు. విజయవాడ పున్నమిఘాట్, సింగ్‌నగర్ ఎంబీకే స్టేడియంలో వైభవంగా విజయవాడ ‌ఉత్సవ్ 2.0 జరుగుతోంది. సందర్శకులకు అద్భుతమైన కళాప్రదర్శనలు కనువిందు చేస్తున్నాయి. ఈరోజు (ఆదివారం) విజయవాడ ‌ఉత్సవ్ 2.0లో రాఘవేంద్రరావు పాల్గొని, మాట్లాడారు. విజయవాడతో తనకు ఎంతో అనుబంధం ఉందని వెల్లడించారు.


నేను విజయవాడలో జన్మించాను..

విజయవాడ ఉత్సవ్ ద్వారా నేడు నగరం ఎంతగానో కళకళలాడుతోందని రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు. జాతీయ, రాష్ట్ర అవార్డులను చాలావరకు తాను తీసుకున్నానని ప్రస్తావించారు. నేడు విజయవాడ ఉత్సవ్‌లో ఈ అవార్డు అందుకోవడం తనకు ప్రత్యేకంగా ఉందని తెలిపారు. తాను విజయవాడ అమెరికన్ ఆస్పత్రిలో జన్మించానని గుర్తుచేసుకున్నారు. దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు పుట్టిన నేల‌పై తానూ పుట్టడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆకాంక్షించారు. తనకు విజయవాడ నగరం, కృష్ణానది ఎన్నో అనుభూతులను ఇచ్చిందని రాఘవేంద్రరావు తెలిపారు.


విజయవాడ ఉత్సవ్‌ 2.0కు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది: ఎంపీ శివనాథ్

విజయవాడ ఉత్సవ్‌ 2.0కు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పేర్కొన్నారు. నేడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇక్కడకు రావడం సంతోషంగా ఉందని వెల్లడించారు. ఢిల్లీ తర్వాత విజయవాడకు జాతీయ సరస్ మేళాను తీసుకు రావడంలో‌ కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చాలా కృషి చేశారని ప్రశంసించారు. విభిన్న సంప్రదాయాలు, సంస్కృతుల మేళ‌వింపు విజయవాడ ఉత్సవ్ అని తెలిపారు. సరస్ మేళాకు పెద్దసంఖ్యలో సందర్శకులు తరలి వస్తున్నారని చెప్పారు. మహిళలు, పేదలు ఆర్థిక వృద్ది సాధించడమే ఈ ఉత్సవాల ప్రధాన ఉద్దేశమని ఎంపీ శివనాథ్ పేర్కొన్నారు ఈరోజు విజయవాడ ఉత్సవ్‌లో ఎంపీ‌ కేశినేని శివనాథ్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, కోమటి జయరాం, పాతూరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మున్సిపల్ ఎన్నికలు.. మేయర్ అభ్యర్థులపై ఉత్కంఠ.. సీఎం నిర్ణయంపై ఆసక్తి

రాయచోటి, పుంగనూరు ఘటనలపై నివేదిక కోరాం.. చర్యలు తీసుకుంటాం: ఏపీ ఎస్‌ఈసీ

రాయచోటిలో కిరాయి ముఠాలతో ప్రజలను భయపెట్టాలని చూసే ఊరుకోం.. వైసీపీపై మండిపల్లి ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 18 , 2026 | 10:00 PM