Share News

రాయచోటిలో మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఏకగ్రీవం: మంత్రి మండిపల్లి

ABN , Publish Date - Oct 18 , 2026 | 06:39 PM

అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవమయ్యాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కూటమి అభ్యర్థుల ఏకగ్రీవంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

రాయచోటిలో మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఏకగ్రీవం: మంత్రి మండిపల్లి
AP Minister Mandipalli Ramprasad Reddy

అన్నమయ్య జిల్లా, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవమయ్యాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (AP Minister Mandipalli Ramprasad Reddy) తెలిపారు. కూటమి అభ్యర్థుల ఏకగ్రీవంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు (ఆదివారం) రాయచోటిలో మీడియాతో మంత్రి మండిపల్లి మాట్లాడారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏకగ్రీవమైన కూటమి అభ్యర్థులను మంత్రి అభినందించారు.


వైసీపీకి రాజకీయ ఎదురుదెబ్బలు తప్పవు..

కర్మ రిటర్న్స్ అని.. వైసీపీ నేతలు గతంలో చేసిన తప్పులకు ప్రజలే బుద్ధి చెబుతున్నారని మంత్రి మండిపల్లి పేర్కొన్నారు. వైసీపీ గతంలో చేసిన దౌర్జన్యాలు, అరాచకాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతున్నారని తెలిపారు. జగన్ అండ్ కో చేసిన అరాచకాల ఫలితాలే ఇప్పుడు వైసీపీకి ఎదురవుతున్నాయని విమర్శించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన వైసీపీకి రాజకీయ ఎదురుదెబ్బలు తప్పవని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మున్సిపల్ ఎన్నికలు.. మేయర్ అభ్యర్థులపై ఉత్కంఠ.. సీఎం నిర్ణయంపై ఆసక్తి

రాయచోటి, పుంగనూరు ఘటనలపై నివేదిక కోరాం.. చర్యలు తీసుకుంటాం: ఏపీ ఎస్‌ఈసీ

రాయచోటిలో కిరాయి ముఠాలతో ప్రజలను భయపెట్టాలని చూసే ఊరుకోం.. వైసీపీపై మండిపల్లి ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 18 , 2026 | 07:51 PM