వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ.. స్థానిక ఎన్నికల నామినేషన్ల గడువు పిటిషన్ కొట్టివేత
ABN , Publish Date - Oct 18 , 2026 | 05:39 PM
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల గడువు పెంచాలని వైసీపీ వేసిన అనుబంధ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. గడువు ముగియడంతో పిటిషన్ నిరర్థకమైందని పేర్కొంది. స్థానికంగా నామినేషన్లు వేయలేని అభ్యర్థులు జిల్లా కేంద్రాల్లో నామినేషన్లు వేసేందుకు అనుమతించే అంశంపై ఎన్నికల కమిషన్ కౌంటర్ దాఖలు చేయాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది.
అమరావతి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ గడువు పెంచాలని వైసీపీ వేసిన అనుబంధ పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) కొట్టివేసింది. హౌస్ మోషన్ పిటిషన్పై న్యాయస్థానం ఈరోజు (ఆదివారం) విచారణ జరిపింది. నామినేషన్ల గడువు ముగియడంతో ఇప్పుడు మీరు వేసిన పిటిషన్ నిరార్థకమైందని హైకోర్టు పేర్కొంది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జోక్యం చేసుకోకూడదని ఉన్న తీర్పులకు అనుగుణంగా వైసీపీ వేసిన అనుబంధ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది.
ఆయా జిల్లా కేంద్రాల్లో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వైసీపీ వేసిన పిటిషన్ను డివిజనల్ బెంచ్ అనుమతించింది. స్థానికంగా నామినేషన్లు వేయనివ్వని పక్షంలో ఈ ఎన్నికల్లో ఆయా జిల్లా కేంద్రాల్లో నామినేషన్ వేసుకునేందుకు వెసులుబాటు ఉంటుందని వైసీపీ సీనియర్ న్యాయవాది వాదించారు. ఈ విషయంపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను డివిజనల్ బెంచ్ ఆదేశించింది. ఈ విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మున్సిపల్ ఎన్నికలు.. మేయర్ అభ్యర్థులపై ఉత్కంఠ.. సీఎం నిర్ణయంపై ఆసక్తి
రాయచోటి, పుంగనూరు ఘటనలపై నివేదిక కోరాం.. చర్యలు తీసుకుంటాం: ఏపీ ఎస్ఈసీ
రాయచోటిలో కిరాయి ముఠాలతో ప్రజలను భయపెట్టాలని చూసే ఊరుకోం.. వైసీపీపై మండిపల్లి ధ్వజం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News