Share News

హైదరాబాద్‌లో విషాదం.. షేర్ మార్కెట్ నష్టాలతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

ABN , Publish Date - Oct 19 , 2026 | 10:50 AM

హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. 34 ఏళ్ల తమ్మిశెట్టి ప్రవీణ్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.

హైదరాబాద్‌లో విషాదం.. షేర్ మార్కెట్ నష్టాలతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
Hyderabad news

హైదరాబాద్, అక్టోబర్ 19: నగరంలోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. 34 ఏళ్ల తమ్మిశెట్టి ప్రవీణ్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ప్రవీణ్‌కు మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ప్రవీణ్.. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాడు. అయితే అందులో నష్టపోయిన అతడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కుటుంబసభ్యులు, బంధువుల ముందు పరువుపోతుందేమే అన్న భయంతో కఠిన నిర్ణయం తీసుకున్నాడు. చైతన్యపురిలోని ఓ భవనం పై నుంచి దూకేశాడు.


తీవ్రంగా గాయపడిన అతడు.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న వెంటనే చైతన్యపురి పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రవీణ్ మృతిసమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రవీణ్ మృతి విషయం తెలిసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. 15 మందికి గాయాలు

దసరా వచ్చిందయ్యా.. సంబరం తెచ్చిందయ్యా.

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 19 , 2026 | 10:53 AM