ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. 15 మందికి గాయాలు
ABN , Publish Date - Oct 19 , 2026 | 08:59 AM
హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాటసింగారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సు వస్తోంది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఖమ్మం డిపో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
హైదరాబాద్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాటసింగారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు తెలంగాణ ఆర్టీసీ బస్సు వస్తోంది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఖమ్మం డిపో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ బస్సులోని 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వనస్థలిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ పోస్టుల భర్తీకి రేవంత్ సర్కార్ గ్రీన్‌సిగ్నల్
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరవు: మంత్రి పొన్నం ప్రభాకర్
మాజీ డీజీపీ భార్య తనూజ హత్య కేసులో కీలక పురోగతి.. పోలీసుల అదుపులో నేపాలీ గ్యాంగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News