Share News

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ పోస్టుల భర్తీకి రేవంత్ సర్కార్ గ్రీన్‌సిగ్నల్

ABN , Publish Date - Oct 18 , 2026 | 07:30 PM

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 429 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ అనుమతి ఇచ్చింది. తొలి విడతలో ప్రత్యక్ష నియామకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ పోస్టుల భర్తీకి రేవంత్ సర్కార్ గ్రీన్‌సిగ్నల్
Telangana Government

హైదరాబాద్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 429 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ అనుమతి ఇచ్చింది. తొలి విడతలో ప్రత్యక్ష నియామకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీలో అత్యధికంగా 252 పోస్టులను భర్తీచేయనుంది.


అలాగే, కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల్లో చెరో 49 పోస్టులు, పాలమూరు యూనివర్సిటీలో 45 పోస్టులు, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీల్లో చెరో 16 పోస్టులు, తెలంగాణ యూనివర్సిటీలో రెండు పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నియామక ప్రకటనల జారీకి తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం: డీజీపీ ఆనంద్

దసరా పండుగ రద్దీ.. టికెట్‌పై ఆర్టీసీ 40శాతం అదనపు ఛార్జీలు

అహ్మదాబాద్ - హైదరాబాద్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 18 , 2026 | 08:03 PM