Share News

దసరా పండుగ రద్దీ.. టికెట్‌పై ఆర్టీసీ 40శాతం అదనపు ఛార్జీలు

ABN , Publish Date - Oct 17 , 2026 | 08:50 AM

దసరా పండుగ నేపథ్యంలో భాగ్యనగరంలో ఉండే వారు సొంతూళ్లకు బయలుదేరారు. ఈ క్రమంలో ప్రయాణికులతో సిటీలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి.

దసరా పండుగ రద్దీ.. టికెట్‌పై ఆర్టీసీ 40శాతం అదనపు ఛార్జీలు
Dasara Festival

హైదరాబాద్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): దసరా పండుగ నేపథ్యంలో భాగ్యనగరంలో ఉండే వారు సొంతూళ్లకు బయలుదేరారు. ఈ క్రమంలో ప్రయాణికులతో సిటీలోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఇవాళ (శనివారం) తెల్లవారుజాము నుంచి జేబీఎస్ బస్టాండులో ప్రయాణికుల రద్దీ క్రమంగా పెరిగింది. ఆర్టీసీ స్పెషల్ బస్సులు సమయానికి రాకపోవడంతో ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. ప్రత్యేక బస్సుల్లో 40శాతం అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు 7000 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోంది.


ఈరోజు సాయంత్రం నుంచి ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్ బస్టాండ్ల వద్ద పరిస్థితిని నేరుగా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు 95 శాతం ప్రత్యేక బస్సుల నిర్వహణను పూర్తి చేశారు. అక్టోబరు 17, 18, 19 తేదీల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. బస్సుల నిర్వహణ, ట్రాఫిక్ పరిస్థితులపై అధికారులు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బస్ స్టేషన్లలో తాగునీరు, విశ్రాంతి, పారిశుధ్యం, భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దసరా పండుగ తర్వాత తిరుగు ప్రయాణానికి కూడా యధావిధిగా స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నన్ను కిరాయి మనుషులతో కేటీఆర్ తిట్టిస్తున్నారు.. కవిత ధ్వజం

మొక్కజొన్న పంట మధ్యలో గంజాయి సాగు.. పోలీసుల ఉక్కుపాదం

మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్‌ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 17 , 2026 | 10:11 AM