నన్ను కిరాయి మనుషులతో కేటీఆర్ తిట్టిస్తున్నారు.. కవిత ధ్వజం
ABN , Publish Date - Oct 16 , 2026 | 12:51 PM
మాజీ మంత్రి కేటీఆర్ సింగరేణి సభలో కార్మికుల సమస్యల కంటే రాజకీయాలే ఎక్కువగా మాట్లాడారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఆయనకు సింగరేణి సమస్యలు తెలియదని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కేటీఆర్ సింగరేణి సభలో కార్మికుల సమస్యల కంటే రాజకీయాలే ఎక్కువగా మాట్లాడారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) విమర్శించారు. ఆయనకు సింగరేణి సమస్యలు తెలియదని ఎద్దేవా చేశారు. ఈరోజు (శుక్రవారం) హైదరాబాద్‌లో మీడియాతో కవిత మాట్లాడారు. పోరాటం చేయాల్సిన బీఆర్ఎస్ సభలు పెట్టి షో ఆఫ్ చేస్తోందని సెటైర్లు గుప్పించారు. అది కార్మిక గర్జన కాదని.. కేటీఆర్ గర్జన అని వ్యంగ్యంగా మాట్లాడారు. సింగరేణి ఎన్నికల్లో హెచ్.ఎం.ఎస్, టీఆర్ఎస్ కలిసి విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. విదేశీ బొగ్గుపై కేటీఆర్‌కు అవగాహన లేదని విమర్శించారు.
ప్రతిమ శ్రీనివాస్ బీఆర్ఎస్కు ఆర్థికంగా సహాయం చేశారు..
తోడబుట్టిన తనను కిరాయి మనుషులతో కేటీఆర్ తిట్టిస్తున్నారని కవిత ధ్వజమెత్తారు. ప్రతిమ శ్రీనివాస్‌ను ఇరికించేందుకు కేటీఆర్ సీఎంకు లేఖ రాయలేదా..? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతిమ శ్రీనివాస్ బీఆర్ఎస్కు ఆర్థికంగా సహాయం చేశారని ప్రస్తావించారు. అందుకే సీఎం రేవంత్‌రెడ్డి విచారణ చేయిస్తానని అన్నారన్నారు. తనకు ఫామ్‌హౌస్ వివరాలు పెద్దగా తెలియదని చెప్పుకొచ్చారు. కాంట్రాక్టు లెక్చరర్ల పాపం కేసీఆర్ హయాంలోదేనని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇసుక, మట్టి దోపిడీ, ఇందిరమ్మ ఇళ్ల కోసం లంచం అనేది ట్రేడ్ మార్క్‌గా మారిందని ఆరోపణలు చేశారు. కరెంటు విషయంలో కేంద్ర మంత్రులను తాము కలుస్తామని పేర్కొన్నారు.
ఆదివాసీ ఆడబిడ్డలు చనిపోతే సీఎం పట్టించుకోలేదు..
డమ్మీ ఉద్యమాలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి స్వాగతమని.. ఆదివాసీ ఆడబిడ్డలు చనిపోతే సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు పట్టించుకోలేదని కవిత ప్రశ్నించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ పక్కన కూర్చుని రాజ్యాంగ విలువల గురించి ముఖ్యమంత్రి మాట్లాడారని అన్నారు. సీఎం ఎల్‌నినోపై తన అసహాయతను వ్యక్తం చేశారన్నారు. ఎల్‌నినోపై పక్క రాష్ట్రాలు ముందుగానే కరువు మండలాలు ప్రకటించాయని ప్రస్తావించారు. కేంద్రప్రభుత్వానికి నివేదికలు పంపాయని తెలిపారు. రైతులు త్యాగం చేయాలని సీఎం అంటున్నారని.. పీఏసీఎస్‌లో దొడ్డిదారిన కాంగ్రెస్ నేతలను పెట్టాలని రేవంత్‌రెడ్డి చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన తమ రాజకీయ పదవులను త్యాగం చేస్తారా...? అని ప్రశ్నించారు. సీఎం రాష్ట్ర సంపదను తమ కుటుంబ సభ్యులకు దోచిపెడుతున్నారని కవిత ఆగ్రహించారు.
రైతు కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలి..
ఉపాధి హామీ పని అందరికీ దొరుకుతుందా...? అని కవిత నిలదీశారు. రేవంత్ రైతులను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రైతు కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతు కూలీలకు రూ.12,000 ప్రభుత్వం ఇవ్వాలని పట్టుబట్టారు. మిషన్ భగీరథ మెయింటెనెన్స్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా ఎందుకు చేయట్లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. మేడిగడ్డను కూలగొట్టి మళ్లీ కడతారా...? లేదా...? ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని అన్నారు. కేసీఆర్ పాలనపై రేవంత్ మాట్లాడుతూ టైమ్‌పాస్ చేస్తారా...?.. సీఎం విమర్శలు బంద్ చేసి కట్టడం ప్రారంభించాలని హితవు పలికారు. హైదరాబాద్ నగరంలో 8 వేల చెరువులు మాయం అయ్యాయని కాగ్ రిపోర్ట్ ఇచ్చిందని ప్రస్తావించారు. కృష్ణానది జలాల కోసం ఒక్క సంవత్సరం మాత్రమే కేసీఆర్ హయాంలో సంతకం పెట్టారని తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి చూస్తున్నారుని కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీ - 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి రాష్ట్రాల సహకారం అవసరం: సీఎం రేవంత్
నల్లగొండ జిల్లాకు అధికారులు నీళ్లు రాకుండా చేస్తున్నారు: గుత్తా సుఖేందర్ రెడ్డి
హైదరాబాద్‌లో ఆధ్యాత్మికత పేరుతో మహిళకు వల.. గురూజీపై కేసు.!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News