నల్లగొండ జిల్లాకు అధికారులు నీళ్లు రాకుండా చేస్తున్నారు: గుత్తా సుఖేందర్ రెడ్డి
ABN , Publish Date - Oct 14 , 2026 | 11:53 AM
నల్లగొండ జిల్లాలో సాగు నీరు అందక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొందరు అధికారులు పాలకులపై ఒత్తిడి తీసుకొచ్చి జిల్లాకు నీళ్లు రాకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు.
నల్లగొండ జిల్లా, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లాలో సాగు నీరు అందక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukhender Reddy) వ్యాఖ్యానించారు. కొందరు అధికారులు పాలకులపై ఒత్తిడి తీసుకువచ్చి జిల్లాకు నీళ్లు రాకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు (బుధవారం) నల్లగొండలో మీడియాతో గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్చాట్ చేశారు.
నీళ్లన్నీ పాలమూరుకే కావాలని అనడం సరికాదు..
నీళ్లన్నీ పాలమూరుకే కావాలని అనడం సరికాదని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. డిండికి నీళ్లు కేటాయించవద్దని అనడం ఏంటి? అని ప్రశ్నించారు. నల్లగొండకు నీళ్లు ఎలా ఇస్తారని సీఎంపై అధికారులు ఒత్తిడి తేవడం ఏంటి? అని ప్రశ్నించారు. ఎవరి మాటలో విని సీఎం, ఇంకొకరు కాని నిర్ణయం తీసుకోవడం సరికాదని అన్నారు. నల్లగొండ జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందుతోందని తెలిపారు. పాలమూరులో 25 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు ప్రారంభం అయ్యాయని.. కానీ ఎక్కడి నుంచి నీళ్లు తీసుకుంటారో సరైన ప్లాన్ లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ కూటమిలో ఎన్నికల హడావుడి.. సీట్ల సర్దుబాటుపై చర్చలు
అమరావతి క్వాంటం వ్యాలీలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం
ఆత్మకూరు బైపాస్ రోడ్డుకు వాయుపుత్ర మార్గ్గా నామకరణం చేశాం: పవన్ కల్యాణ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News