Share News

హైదరాబాద్‌లో ఆధ్యాత్మికత పేరుతో మహిళకు వల.. గురూజీపై కేసు.!

ABN , Publish Date - Oct 14 , 2026 | 09:49 AM

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఆధ్యాత్మికత పేరుతో శ్రీ చైతన్య గురూజీ అలియాస్ సునీల్‌రెడ్డి ఓ మహిళను వేధించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విష్ణుదీప్‌రెడ్డి కాపురంలో అతను చిచ్చుపెట్టాడు.

హైదరాబాద్‌లో ఆధ్యాత్మికత పేరుతో మహిళకు వల.. గురూజీపై కేసు.!
Woman Harassment Case

హైదరాబాద్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఆధ్యాత్మికత పేరుతో శ్రీ చైతన్య గురూజీ అలియాస్ సునీల్‌రెడ్డి ఓ మహిళను వేధించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విష్ణుదీప్‌రెడ్డి కాపురంలో సునీల్‌రెడ్డి సమస్యలు తీసుకువచ్చాడు. కోర్టు ఆదేశాలతో అతనిపై కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ -71లోని శ్రీవిద్యా సాధనా సెంటర్‌ నిర్వాహకుడిగా సునీల్‌రెడ్డి ఉన్నాడు.


సాధనల పేరుతో తన భార్యకు గురూజీ అసభ్య సందేశాలు, వ్యక్తిగత చాటింగ్‌లు పంపిస్తున్నాడని ఆమె భర్త విష్ణుదీప్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లయిన కొన్ని నెలల నుంచి తన భార్య పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో తెలిపాడు. తన భార్యకు అసభ్య మెసేజ్‌లతో పాటు అభ్యంతరకరంగా మెసేజ్‌లు పెట్టాడని అన్నాడు.


మేరెడ్డి సునీల్‌రెడ్డిని నిలదీసినందుకు తనను చంపేస్తానని బెదిరింపులకు దిగాడని బాధితురాలి భర్త విష్ణుదీప్‌రెడ్డి పోలీసులకు చెప్పాడు. చాటింగ్ ఆధారాలు, బెదిరింపుల వివరాలతో కోర్టును ఆమె భర్త ఆశ్రయించాడు. ఈ క్రమంలో గురూజీపై బీఎన్ఎస్ 351(2) సెక్షన్ కింద కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం

హాస్టళ్ల టెండర్లలో రూ.66 కోట్ల గుడ్‌విల్?.. రేవంత్ ప్రభుత్వంపై హరీశ్‌రావు సంచలన ఆరోపణలు

హైదరాబాద్‌లో క్రిప్టోకరెన్సీ పేరుతో భారీ దోపిడీ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 10:34 AM