Share News

మొక్కజొన్న పంట మధ్యలో గంజాయి సాగు.. పోలీసుల ఉక్కుపాదం

ABN , Publish Date - Oct 16 , 2026 | 10:45 AM

నెల్లూరు జిల్లాలో గంజాయి సాగును అరికట్టడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆపరేషన్‌ త్రిశూల్‌లో భాగంగా మాదకద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో జిల్లాలోని దుత్తలూరు శివారులో జరిగే గంజాయి సాగును జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల శుక్రవారం పరిశీలించారు.

 మొక్కజొన్న పంట మధ్యలో గంజాయి సాగు.. పోలీసుల ఉక్కుపాదం
Nellore Cannabis Cultivation

నెల్లూరు జిల్లా, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లాలో గంజాయి సాగును అరికట్టడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆపరేషన్‌ త్రిశూల్‌లో భాగంగా మాదకద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో జిల్లాలోని దుత్తలూరు శివారులో జరిగే గంజాయి సాగును ఆ జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఈరోజు (శుక్రవారం) పరిశీలించారు. నేరుగా ఎస్పీ రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. మొక్కజొన్న పంట మధ్యలో.. రెండెకరాల్లో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు. డ్రోన్‌ సాయంతో 9.5 ఎకరాల పొలంలో తనిఖీలు చేశారు. 1,731 గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించారు.


గంజాయి మొక్కలు 3 నుంచి 6 అడుగుల ఎత్తులో ఉన్నాయని పోలీసులు తెలిపారు. డ్రిప్‌ సాయంతో గంజాయి పంటకు నీటి సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. మూడు నెలలుగా రహస్యంగా గంజాయి సాగు చేస్తున్నారని తెలిపారు. ప్రధాన నిందితుడు ఉప్పలపాటి సుబ్బారెడ్డితో సహా ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.


మన్యం జిల్లా వాసుల సహకారంతో గంజాయి సాగు, గుంటూరు, పుంగనూరు ప్రాంతాల నుంచి ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. గంజాయి కొనుగోలుకు కొంతమంది రూ.50 వేలు అడ్వాన్స్‌ ఇచ్చినట్లుగా నిందితుడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. గంజాయి పంట విక్రయిస్తే రూ.కోటి వరకు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. దుత్తలూరు పోలీస్‌ స్టేషన్‌లో క్రైమ్‌ నంబర్‌ 74/2026తో కేసు నమోదు చేశారు. ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. న్యాయస్థానం అనుమతితో గంజాయి పంట ధ్వంసానికి చర్యలు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజకీయ ప్రమేయం లేకుండా రిజర్వేషన్లు.. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం: మంత్రి నారాయణ

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దిక్కుతోచని స్థితిలో గొడ్డలి పార్టీ: మంత్రి కొల్లు రవీంద్ర

ఏపీకి భారీగా పెట్టుబడులు.. త్వరలో మూడు ప్రాంతాల్లో సదస్సులు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 16 , 2026 | 12:34 PM