Share News

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరవు: మంత్రి పొన్నం ప్రభాకర్

ABN , Publish Date - Oct 18 , 2026 | 07:58 PM

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో  తీవ్ర కరవు: మంత్రి పొన్నం ప్రభాకర్
Telangana Minister Ponnam Prabhakar

సిద్దిపేట జిల్లా, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ (Telangana Minister Ponnam Prabhakar) వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరవు విలయతాండవం చేస్తోందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ మండలం గాంధీనగర్ తోటపల్లి - గాంధీనగర్ గ్రామాల బతుకమ్మ ఘాట్ వద్ద హైమాస్ట్ లైట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు (ఆదివారం) ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద సద్దుల బతుకమ్మ వేడుకల్లో మంత్రి పాల్గొని సందడి చేశారు.


హుస్నాబాద్ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. రాష్ట్రంలో సమృద్ధి వర్షాలతో, పాడిపంటలతో.. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గౌరీదేవతను పూజించాలని కోరారు. తెలంగాణలో కొంత వర్షాలు పడినప్పటికీ, తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఆ దేవుడు సమృద్ధిగా వర్షాలు కురిపిస్తే రైతులంతా పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో ఉంటారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం: డీజీపీ ఆనంద్

దసరా పండుగ రద్దీ.. టికెట్‌పై ఆర్టీసీ 40శాతం అదనపు ఛార్జీలు

అహ్మదాబాద్ - హైదరాబాద్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 18 , 2026 | 08:53 PM