మాజీ డీజీపీ భార్య తనూజ హత్య కేసులో కీలక పురోగతి.. పోలీసుల అదుపులో నేపాలీ గ్యాంగ్
ABN , Publish Date - Oct 18 , 2026 | 04:32 PM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో నలుగురు నేపాలీ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో నలుగురు నేపాలీ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో పనిచేసే నేపాలీ పనిమనిషి కల్పనతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లోని తన ఇంట్లో నేపాలీ పనిమనిషి చేతిలో ఈ ఏడాది మే 8వ తేదీన జూబ్లీహిల్స్ ప్రశాంత్నగర్లో తనూజ హత్యకు గురైన విషయం తెలిసిందే. గత ఆరు నెలలుగా నేపాలీ గ్యాంగ్ కోసం తెలంగాణ స్పెషల్ టీం పోలీసులు వెతుకుతున్నారు. మరో ముగ్గురు దుండగుల కోసం నేపాల్లో స్పెషల్ టీం పోలీసులు గాలిస్తున్నారు. తనుజా హత్య అనంతరం బంగారు ఆభరణాలతో నేపాలీ పనిమనిషి కల్పన గ్యాంగ్ ఉడాయించిందని పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం: డీజీపీ ఆనంద్
దసరా పండుగ రద్దీ.. టికెట్పై ఆర్టీసీ 40శాతం అదనపు ఛార్జీలు
అహ్మదాబాద్ - హైదరాబాద్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News