Share News

కూటమి ఏకగ్రీవాలు!

ABN , Publish Date - Oct 19 , 2026 | 06:05 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కొన్ని చోట్ల ఏకగ్రీవాలయ్యాయి. ప్రత్యర్థులు ఎవరూ లేకపోవడంతో నామినేషన్‌ వేసిన అభ్యర్థులే ఆయా స్థానాల్లో ఏకగ్రీవంగా గెలిచే అవకాశం కనిపిస్తోంది.

కూటమి ఏకగ్రీవాలు!
KUTAMI

  • పలుచోట్ల పోటీలో లేని వైసీపీ.. పులివెందులలో 10 వార్డులు,

  • కమలాపురం చైర్‌పర్సన్‌ సహా అన్ని వార్డులూ ఏకపక్షమే

  • పుంగనూరు చైర్మన్‌ కూడా.. రేపు పూర్తిస్థాయి స్పష్టత

  • పోటీలో లేని వైసీపీ నేతలు

  • పులివెందులలో 10 వార్డులు

  • కమలాపురం చైర్‌పర్సన్‌ సహా

  • అన్ని వార్డులూ ఏకపక్షమే

  • పుంగనూరు చైర్మన్‌ కూడా

  • రేపు పూర్తిస్థాయి స్పష్టత

(ఆంధ్రజ్యోతి - )

స్థానిక సంస్థల ఎన్నికల్లో మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కొన్ని చోట్ల ఏకగ్రీవాలయ్యాయి. ప్రత్యర్థులు ఎవరూ లేకపోవడంతో నామినేషన్‌ వేసిన అభ్యర్థులే ఆయా స్థానాల్లో ఏకగ్రీవంగా గెలిచే అవకాశం కనిపిస్తోంది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం.. ఏకగ్రీవాలపై స్పష్టత రానుంది.

ఎక్కడెక్కడ?

కడప జిల్లా పులివెందులలో మొత్తం 40 వార్డులు ఉన్నాయి. తొలిసారి ఇక్కడ టీడీపీ సుమారు 10 వరకు వార్డులు ఏకగ్రీవం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ మొత్తం 40 వార్డులు ఉండగా వైసీపీ నుంచి మొత్తం 30 నామినేషన్లు, టీడీపీ నుంచి 69 నామినేషన్లు దాఖలయ్యాయి.

కమలాపురంలో 23 వార్డులున్నాయి. వైసీపీ నుంచి చైర్‌పర్సన్‌కు కానీ వార్డులకు కానీ ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. దీంతో టీడీపీకి దాదాపు ఏకగ్రీవమైనట్లేనని తెలుస్తోంది.

మైదుకూరు మున్సిపాలిటీలో వైసీపీ నుంచి చైర్మన్‌ అభ్యర్థిగా ఎవరూ నామినేషన్‌ వేయలేదు. దీంతో ఇది కూడా టీడీపీకి ఏకగ్రీవమైనట్టేనని చెబుతున్నారు. అదేవిధంగా ఎర్రగుంట్ల చైర్‌పర్సన్‌ పదవిని బీజేపీకి కేటారుంచారు. ఇక్కడ తొలిరోజు ఒక వార్డుకు మాత్రమే వైసీపీ నామినేషన్‌ దాఖలు చేసింది. తర్వాత వైసీపీ నుంచి ఎవరూ నామినేషన్‌ వేయలేదు. దీంతో ఇది బీజేపీకి ఏకగ్రీవం అవుతుందని అంటున్నారు.

అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మున్సిపాలిటీలో 37 వార్డులు ఉండగా, ఐదు వార్డులకు వైసీపీ అభ్యర్థులు నామినేషన్‌ వేయలేదు. దీంతో అవి ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.


గుత్తి మున్సిపాలిటీలోని 32 వార్డులకుగాను 8 వార్డులకు మాత్రమే వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మిగిలిన 22 వార్డుల్లో కూడా ఏకగ్రీవాలకు అవకాశం ఉందని తెలుస్తోంది.

పిఠాపురంలో వైసీపీ 5, 15 వార్డుల్లో అసలు నామినేషన్లు దాఖలు చేయలేదు. ఆ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి.

పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల పురపాలక సంఘం, గురజాల నగర పంచాయితీలకు చైర్మన్‌ అభ్యర్థులుగా వైసీపీ తరఫున ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో ఆయా స్థానాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులకు ఏకపక్ష విజయం దక్కనుంది. పిడుగురాళ్లలో 40 వార్డుల్లోనూ కూటమికి చెందిన అభ్యర్థులే నామినేషన్లు వేశారు. గురజాలలో 23 వార్డులు ఉండగా కూటమి అభ్యర్థులే కౌన్సిలర్‌ పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు.

పుంగనూరు చైర్మన్‌ స్థానానికి దాఖలైన 8 నామినేషన్లూ టీడీపీ వారివే. ఇక, రాయచోటి చైర్మన్‌ స్థానానికి దాఖలైన రెండు నామినేషన్లలో టీడీపీ తరఫున 1, స్వతంత్ర అభ్యర్థిది ఒకటి ఉన్నాయి. దీంతో ఇవి కూడా ఏకగ్రీవాలు కానున్నాయి.

తిరుపతి కార్పొరేషన్‌లో 19 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు పోటీలో లేరు. నగరంలో మొత్తం 66 డివిజన్లు ఉండగా వీటిలో కేవలం 47 డివిజన్లకే వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 19 డివిజన్లకు నామినేషన్లు వేసిన ఇతర పార్టీల అభ్యర్థులను, స్వతంత్ర అభ్యర్థులను కూటమి నేతలు సర్దుబాటు చేసుకుంటే అవన్నీ ఏకగ్రీవమయ్యే అవకాశాలున్నాయి

ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ.. స్థానిక ఎన్నికల నామినేషన్ల గడువు పిటిషన్ కొట్టివేత

మున్సిపల్ ఎన్నికలు.. మేయర్ అభ్యర్థులపై ఉత్కంఠ.. సీఎం నిర్ణయంపై ఆసక్తి

Updated Date - Oct 19 , 2026 | 06:06 AM