ఏపీ స్థానిక ఎన్నికలపై మంత్రి లోకేశ్ పవర్‌ఫుల్ పోస్టు.. ఏమన్నారంటే..
ABN , Publish Date - Oct 19 , 2026 | 11:37 AM
ఏపీ వ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు రికార్డు స్థాయిలో 22,800కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
అమరావతి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఏపీవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు రికార్డు స్థాయిలో 22,800కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) తెలిపారు. ఏపీలోని ప్రతి పార్టీ, ప్రతి వర్గం, నలుమూలల నుంచి అభ్యర్థులు ఈ ఎన్నిక కోసం ముందుకు వచ్చారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం సజీవంగా, వర్ధిల్లుతోందని చెప్పుకొచ్చారు. ఒక్క ఓటు కూడా పడకముందే అక్రమాలు జరిగాయని ఆరోపించేవారు.. ఒక విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. ఎన్నికల్లో గెలుపు క్షేత్రస్థాయిలో ఉంటుందని, పత్రికా సమావేశాల్లో కాదని.. ప్రజలను ఎదుర్కోండి, ప్రజలే ఫలితాలను నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మంత్రి లోకేశ్ పోస్టు పెట్టారు.
మిజోరం సీఎం లాల్దుహోమాతో మంత్రి లోకేశ్ భేటీ
మంత్రి నారా లోకేశ్‌తో ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమా ఈరోజు (సోమవారం) సమావేశం అయ్యారు. తొలుత ఉండవల్లి నివాసానికి చేరుకున్న సీఎం లాల్దుహోమాకు లోకేశ్ స్వాగతం పలికారు. ఆయనను శాలువాతో సత్కరించి ప్రత్యేక జ్ఞాపికను బహూకరించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఏపీకి మిజోరం సీఎం వచ్చారు. లోకేశ్‌తో భేటీలో పలు కీలక అంశాలపై లాల్దుహోమా చర్చిస్తున్నారు.



ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్రమంత్రి పెమ్మసాని హీరోగా సినిమా.. రాఘవేంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు
వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ.. స్థానిక ఎన్నికల నామినేషన్ల గడువు పిటిషన్ కొట్టివేత
ఉత్సవ్ ద్వారా ఎంపీ శివనాథ్ విజయవాడకు ఓ బ్రాండ్ తెచ్చారు: పెమ్మసాని
Read Latest AP News And Telangana News And National News
And Telugu News