సీఎంను కలిసిన ఆసియా క్రీడల విజేతలు.. 8 పతకాలపై చంద్రబాబు అభినందనలు
ABN , Publish Date - Oct 07 , 2026 | 04:13 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆసియా క్రీడల్లో పతకాలు సాధించి విజేతలుగా నిలిచిన ఏపీ క్రీడాకారులు కలిశారు. ఈ సందర్భంగా ఆసియా క్రీడల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులకు సీఎం అభినందనలు తెలిపారు.
అమరావతి, అక్టోబర్ 7: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆసియా క్రీడల్లో పతకాలు సాధించి విజేతలుగా నిలిచిన ఏపీ క్రీడాకారులు కలిశారు. ఈ సందర్భంగా ఆసియా క్రీడల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులకు సీఎం అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వేదికలపై ఏపీ ఖ్యాతిని నిలిపారంటూ క్రీడాకారులను ప్రశంసించారు. ఈరోజు(బుధవారం) రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబును ఆసియా క్రీడల విజేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. క్రీడాకారులు సాధించిన పతకాలు, అత్యుత్తమ ప్రదర్శనను ముఖ్యమంత్రి కొనియాడారు.
రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు. జ్యోతిసురేఖ, చరణి, గణేష్ మణిరత్నం, ధీరజ్ బొమ్మదేవరతో సీఎం సమావేశమయ్యారు. 3 క్రీడాంశాల్లో ఏపీ క్రీడాకారులకు 8 పతకాలు సాధించినట్లు చంద్రబాబుకు శాప్ ఎండీ భరణి వివరించారు. 3 స్వర్ణాలు, 2 రజతాలు, 3 కాంస్య పతకాలు ఏపీ క్రీడాకారులు సాధించారన్నారు. మరింత మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సాహం అందిస్తామని.. క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
విశాఖలో CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ప్రారంభం.. రూ.4,249 కోట్ల ప్రాజెక్టులకు భూమి పూజ
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 12 అజెండాలకు ఆమోదం
Read Latest AP News And Telugu News