విశాఖలో CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ప్రారంభం.. రూ.4,249 కోట్ల ప్రాజెక్టులకు భూమి పూజ
ABN , Publish Date - Oct 07 , 2026 | 11:59 AM
ఉత్తరాంధ్ర వేదికగా విశాఖ ఐఐఎంలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ప్రాంతీయ సదస్సును నిర్వహించారు. MSME పాలసీ 4.0, ప్రభుత్వ రాయితీలు, రుణ సదుపాయాలపై పారిశ్రామికవేత్తలకు సీఐఐ సదస్సు అవగాహన కల్పించనుంది.
విశాఖపట్నం, అక్టోబర్ 7: ఉత్తరాంధ్ర వేదికగా విశాఖ ఐఐఎంలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ప్రాంతీయ సదస్సును నిర్వహించారు. ఈరోజు(బుధవారం) కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఎంపీలు ఎం.శ్రీ భరత్, కలిశెట్టి అప్పలనాయుడు.. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. MSME పాలసీ 4.0, ప్రభుత్వ రాయితీలు, రుణ సదుపాయాలపై పారిశ్రామికవేత్తలకు సీఐఐ సదస్సు అవగాహన కల్పించనుంది.
‘ఒక కుటుంబం.. ఒక పారిశ్రామికవేత్త’ లక్ష్యానికి అనుగుణంగా స్టార్టప్‌లు, పెట్టుబడిదారులను సదస్సు అనుసంధానించనుంది. ఈ సదస్సులో రూ.4,249 కోట్ల విలువైన 30 ప్రాజెక్టులకు భూమిపూజ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ల ద్వారా 23,256 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 30 పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. ప్రాంతీయ సదస్సులో మరో 30 పరిశ్రమల ఏర్పాటుకు అవగాహన ఒప్పందాలు(ఎంవోయూ) కుదుర్చుకోనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, సి.ఐ.ఐ (CII) ఆంధ్రప్రదేశ్ చైర్మన్ నరేంద్ర కుమార్ శరణం, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
గోదావరి డెల్టా ముంపు పరిష్కారానికి రూ.13.4 కోట్లతో డీపీఆర్: మంత్రి నిమ్మల
ఢిల్లీ తరువాత విజయవాడలో సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
Read Latest AP News And Telugu News