Share News

25 ఏళ్ల ప్రజాసేవ.. ప్రధాని మోదీకి అచ్చెన్నాయుడు అభినందనలు

ABN , Publish Date - Oct 07 , 2026 | 11:42 AM

ప్రభుత్వ నాయకత్వంలో నేటితో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

25 ఏళ్ల ప్రజాసేవ.. ప్రధాని మోదీకి అచ్చెన్నాయుడు అభినందనలు
Minister Atchannaidu

అమరావతి, అక్టోబర్ 7: ప్రభుత్వ నాయకత్వంలో నేటితో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమై దేశ ప్రధానిగా కొనసాగుతున్న మోదీ ప్రస్థానం ప్రజాసేవకు నిదర్శనమన్నారు. ప్రజల విశ్వాసం, క్రమశిక్షణ, దేశాభివృద్ధి పట్ల నిబద్ధతే మోదీ నాయకత్వానికి బలమని చెప్పుకొచ్చారు. పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఆర్థిక తోడ్పాటు అందించడంతో పాటు.. అన్నదాతల సంక్షేమానికి మోదీ పెద్దపీట వేశారన్నారు. జన్‌ధన్, ప్రత్యక్ష నగదు బదిలీలతో సామాన్యులకు సంక్షేమ ప్రయోజనాలు చేరువయ్యాయని తెలిపారు.


పేదల అభ్యున్నతి, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల విస్తరణకు ప్రాధాన్యం ఇచ్చారని మంత్రి తెలిపారు. మౌలిక వసతులు, స్వదేశీ ఉత్పత్తులు, శాస్త్ర సాంకేతిక రంగాలకు మోదీ ప్రోత్సాహం అందించారన్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత ప్రతిష్ఠను పెంచడంలో మోదీ నాయకత్వం కీలకమని అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలనే మోదీ సంకల్పం స్ఫూర్తిదాయకమన్నారు. మోదీ సంపూర్ణ ఆరోగ్యంతో మరెన్నో ఏళ్లు దేశానికి సేవలందించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు.


ప్రజాసేవలో మోదీ నిబద్ధత స్ఫూర్తిదాయకం: మండిపల్లి

ప్రభుత్వ నాయకత్వంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ప్రజా సేవను జీవిత ధ్యేయంగా చేసుకుని, నిబద్ధత, క్రమశిక్షణతో దేశ సేవలో ముందుకు సాగుతున్న మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిగా మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి, ప్రగతి దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు. దేశ అభివృద్ధి, భారత కీర్తిని ప్రపంచ నలుమూలలకు చాటేలా మోదీ కృషి చేస్తున్నారన్నారు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రాధాన్యాన్ని చాటుతూ, దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యనిస్తూ ప్రధాని పనిచేస్తున్నారని కొనియాడారు.


భారత్ వంటి ప్రజాస్వామ్య దేశంలో సవాళ్లను ఎదుర్కొంటూ నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించిన విజేత మోదీ అని మంత్రి అన్నారు. ప్రజాసేవలో మోదీ నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావం స్ఫూర్తిదాయకమని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో కూడా ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

గోదావరి డెల్టా ముంపు పరిష్కారానికి రూ.13.4 కోట్లతో డీపీఆర్: మంత్రి నిమ్మల

ఢిల్లీ తరువాత విజయవాడలో సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 12:00 PM