మోదీకి చంద్రబాబు అభినందనలు.. 25 ఏళ్ల నాయకత్వంపై ప్రశంసలు
ABN , Publish Date - Oct 07 , 2026 | 09:39 AM
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదవీ బాధ్యతల్లో వరుసగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేశారు.
అమరావతి, అక్టోబర్ 7: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదవీ బాధ్యతల్లో వరుసగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. తన 48 ఏళ్ల ప్రజా జీవితంలో, ప్రభుత్వాలు మారడం, ఆర్థిక వ్యవస్థలు రూపాంతరం చెందడం, సాంకేతికతలు ప్రపంచాన్ని ప్రభావితం చేయడం, నాయకులు ఎదగడం, పడిపోవడం చూశానన్నారు. కాలంతో పాటు ఒక పాఠం మాత్రమే మరింత స్పష్టమైందని... నాయకత్వమే అత్యంత ముఖ్యమన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యనిర్వాహక పదవిలో (పదవి బాధ్యతల్లో) వరుసగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఆయన ప్రయాణాన్ని అత్యుత్తమంగా నిలిపిన అంశాలను గుర్తు చేసుకుంటున్నానని తెలిపారు. స్పష్టమైన దూరదృష్టి, నిజాయతీ, క్రమశిక్షణ, ప్రతీ అంశంపై శ్రద్ధ వహించడం, అన్నింటికంటే ముఖ్యంగా, ప్రణాళికలను అమలు చేసే సామర్థ్యం మోదీ నాయకత్వంలో ఉందన్నారు. పాండమిక్ (మహమ్మారి), యుద్ధాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, వేగవంతమైన సాంకేతిక మార్పుల కాలంలో కూడా, భారతదేశం స్థిరమైన పురోగతితో ముందుకు సాగిందని చెప్పుకొచ్చారు.
అపూర్వమైన వేగంతో మౌలిక సదుపాయాలను విస్తరించామని, సంక్షేమ పథకాల అమలును బలపరిచామని, సాంకేతికతను స్వీకరించామని, వ్యాపార వేత్తలను ప్రోత్సహించామన్నారు. అలాగే ప్రపంచ వేదికపై మరింత నమ్మకంతో ఒక బలమైన శక్తిగా ఆవిర్భవించినట్లు తెలిపారు. ఒక తరాన్ని తీర్చిదిద్దే అవకాశం కొద్దిమంది నాయకులకు మాత్రమే లభిస్తుందని, ఒక దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సహాయపడేవారు ఇంకా చాలా అరుదు అని అన్నారు. ప్రధానమంత్రి మోదీ జీ 25 ఏళ్ల నాయకత్వం, భారతదేశంలో వచ్చిన మార్పులపై ఓ ఆంగ్ల పత్రికలో తన అభిప్రాయ వ్యాసాన్ని (Editorial) సమర్పించడం ఎంతో సంతోషంగా ఉందంటూ ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
తీవ్ర విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు విద్యార్థుల మృతి
నవరాత్రి బ్రహ్మోత్సవాల దర్శన కోటా నేడు విడుదల
Read Latest AP News And Telugu News