Share News

ఆమె ప్రాణం ఖరీదు 25 లక్షలు

ABN , Publish Date - Oct 07 , 2026 | 05:50 AM

ఓ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె బ్లడ్‌ క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్నారు. ఆస్తిపాస్తులను అమ్మి, రుణాలు తీసుకుని ఆ కుటుంబం పాతిక లక్షలు ఖర్చు చేసింది.

ఆమె ప్రాణం ఖరీదు 25 లక్షలు

  • పది నెలలుగా వేలూరు సీఎంసీలో చికిత్స

  • ఇప్పటికే 25 లక్షలకు పైగా ఖర్చు

  • ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపులు

పోరుమామిళ్ల, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ఓ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె బ్లడ్‌ క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్నారు. ఆస్తిపాస్తులను అమ్మి, రుణాలు తీసుకుని ఆ కుటుంబం పాతిక లక్షలు ఖర్చు చేసింది. మరో రూ.25 లక్షలు ఉంటేనే ఆమె ప్రాణం దక్కే అవకాశం ఉందని వైద్యులు చెపున్నారు. ఈ నేపథ్యంలో సాయం చేసి, తమ కుమార్తెను బతికించాలంటూ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రంగ సముద్రానికి చెందిన చెరుకుచెర్ల శ్రీనివాసులు, పార్వతి దంపతులు అభ్యర్థిస్తున్నారు. వారికి కొడుకు నారాయణ, కుమార్తె నాగరాణి ఉన్నారు. ఆమెకు పెళ్లయి మూడేళ్ల కుమార్తె తనిష్క ఉంది. భర్త గురుమూర్తి ప్రైవేటు ఉద్యోగి. కొన్ని నెలల క్రితం నాగరాణి అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయారు. ఆమె బ్లడ్‌ క్యాన్సరుతో బాధపడుతోందని వెల్లూరు సీఎంసీ వైద్యులు గుర్తించారు. నాగరాణి చికిత్సకు దాదాపుగా రూ.15 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పిన వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఆరు నెలల పాటు కీమో థెరఫీ చేశారు.

దానివల్ల వచ్చే ఇతర ఇబ్బందులకూ చికిత్స చేయాల్సి వచ్చింది. మొత్తంగా రూ.25 లక్షల వరకూ ఖర్చు అయింది. ఉన్న ఆస్తులను అమ్ముకున్నారు. బంధుమిత్రుల వద్ద అప్పు చేశారు. వారు నివాసం ఉంటున్న కాలనీ వాసులు రూ.3 లక్షలు సాయం అందించారు. నాగరాణి భర్త పనిచేసే కంపెనీ నుంచి ఇన్సూరెన్స్‌ రూపంలో రూ.8 లక్షలు అందాయి. మరో రూ.8 లక్షలులోను తీసుకున్నారు. అయినా చికిత్స పూర్తి కాలేదు. బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ చేస్తేనే ప్రాణం దక్కుతుందని డాక్టర్లు స్పష్టం చేశారని ఆమె సోదరుడు నారాయణ తెలిపారు. ఆమె వైద్యానికి చేయూత అందించేవారు చెరుకుచెర్ల నారాయణ, ఫోను నం.9581331741, స్టేట్‌ బ్యాంకు ఖాతా నంబరు 32383770805, ఐఎఫ్‌ఎస్సీ కోడ్‌ ఎస్‌బీఐఎన్‌0015374, చెర్లోపల్లె శాఖకు పంపించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి..

అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!

Updated Date - Oct 07 , 2026 | 05:50 AM