Share News

నవరాత్రి బ్రహ్మోత్సవాల దర్శన కోటా నేడు విడుదల

ABN , Publish Date - Oct 07 , 2026 | 06:21 AM

నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ బుధవారం విడుదల చేయనుంది.

నవరాత్రి బ్రహ్మోత్సవాల దర్శన కోటా నేడు విడుదల
tTirumala Navaratri Brahmotsavam

తిరుమల, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ బుధవారం విడుదల చేయనుంది. అక్టోబరు నెలకు రూ.300 దర్శన టికెట్లను ఇప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసింది. అయితే అందులోని 12, 13, 14, 18, 19, 20వ తేదీలకు సంబంధించిన టికెట్ల కోటాను మాత్రం హోల్డ్‌లో ఉంచింది. బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్నందున ఈ తేదీలకు సంబంధించిన కోటాను అక్టోబరు 7 ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసేందుకు సిద్ధమైంది.


ఇవి కూడా చదవండి...
గ్రామాల్లో ప్రపంచస్థాయి విద్య

రహదారుల నిర్మాణంలో భద్రతకే పెద్దపీట

15 రోజుల్లో డిపెండెంట్‌ ఆర్డర్లు!

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 06:21 AM