Share News

మూసీ రివర్‌ఫ్రంట్‌లో భారీ అభివృద్ధి పనులు.. రూ.1,108 కోట్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - Oct 07 , 2026 | 01:10 PM

మూసీ రివర్‌ఫ్రంట్‌లో భారీ అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంచిరేవుల ఓంకారేశ్వర స్వామి ఆలయ సముదాయ అభివృద్ధితో పాటు ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి కలిపి రూ.1,108.27 కోట్లకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులను జారీ చేసింది.

మూసీ రివర్‌ఫ్రంట్‌లో భారీ అభివృద్ధి పనులు.. రూ.1,108 కోట్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Musi Riverfront

హైదరాబాద్, అక్టోబర్ 7: మూసీ రివర్‌ఫ్రంట్‌లో భారీ అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంచిరేవుల ఓంకారేశ్వర స్వామి ఆలయ సముదాయ అభివృద్ధితో పాటు ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి కలిపి రూ.1,108.27 కోట్లకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులను జారీ చేసింది. ఈ మేరకు G.O.Rt.No.928 ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


మంచిరేవులలో ఓంకారేశ్వర స్వామి ఆలయ సముదాయ అభివృద్ధి పనులకు రూ.948.65 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఆలయ సముదాయంలో రాజగోపురాలు, యాగశాల, పుష్కరిణి తదితర నిర్మాణాలు చేపట్టనున్నారు. అలాగే ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి మరో రూ.159.62 కోట్లు కేటాయించింది. 30 మీటర్లు.. 100 అడుగుల వెడల్పుతో ఆరు లేన్ల రోడ్డును నిర్మించనున్నారు. ఇస్తానా విల్లాస్ నుంచి కీర్తి వెస్ట్‌విండ్ విల్లాస్ వరకు సుమారు 2.50 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించనున్నారు. ఈ ఆరు లేన్ల రహదారి గ్రేహౌండ్స్, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రాంతాలకు అనుసంధానం కానుంది. అలాగే మూసీ రివర్‌ఫ్రంట్ రోడ్ నెట్‌వర్క్‌తో ఓంకారేశ్వర ఆలయ సముదాయానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించనున్నారు.


ఇవి కూడా చదవండి..

హైదరాబాద్‌లో మహిళ దారుణ హత్య..

తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 02:00 PM