Share News

తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:31 PM

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 2024 నుంచి డీఏను 33.67 శాతం నుంచి 37.31 శాతానికి పెంచింది.

తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ
Telangana Government

హైదరాబాద్, అక్టోబర్ 7: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 2024 నుంచి డీఏను 33.67 శాతం నుంచి 37.31 శాతానికి పెంచింది. అలాగే జూలై 2024 నుంచి డీఏను 37.31 శాతం నుంచి 40.04 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా 2015 పే స్కేల్ ఉద్యోగులకు కూడా డీఏను 73.344 శాతం నుంచి 78.06 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 2024 నుంచి 78.06 శాతం నుంచి 81.728 శాతానికి, 2020 పే స్కేల్ ఉద్యోగులకు డీఏను 37.31 శాతం నుంచి 40.04 శాతానికి పెంచింది.


యూజీసీ, ఏఐసీటీఈ పే స్కేళ్ల ఉద్యోగులకు కూడా డీఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2016 పే స్కేల్ ఉద్యోగులకు డీఏను 46 శాతం నుంచి 50 శాతానికి, జూలై 2024 నుంచి డీఏను 50 శాతం నుంచి 53 శాతానికి పెంచింది. అలాగే 2006 పే స్కేల్ ఉద్యోగులకు డీఏను 230 శాతం నుంచి 239 శాతానికి, జూలై 2024 నుంచి 239 శాతం నుంచి 246 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.


పెంచిన డీఏను అక్టోబర్ 2026 జీతంతో కలిపి నవంబర్ 1న చెల్లించనున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. జనవరి 2024 నుంచి సెప్టెంబర్ 2026 వరకు ఉన్న డీఏ బకాయిలను 33 వాయిదాల్లో ప్రభుత్వం చెల్లించనుంది. అదే విధంగా జూలై 2024 నుంచి సెప్టెంబర్ 2026 వరకు ఉన్న డీఏ బకాయిలను 27 వాయిదాల్లో చెల్లింపులు జరుపనుంది. డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి..

ఎర్రవల్లి సర్వే నంబర్ 325లో 45.5 ఎకరాల వ్యత్యాసం.. నివేదికపై సీఎం రేవంత్ ఆరా

హైదరాబాద్‌లో మహిళ దారుణ హత్య..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 12:56 PM