Share News

హైదరాబాద్‌లో మహిళ దారుణ హత్య..

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:26 PM

హైదరాబాద్‌లోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం గ్రామ సమీపంలో మహిళ దారుణ హత్యకు గురైంది. ఇందు అరణ్య విల్లాస్ ఎదురుగా కొత్త రోడ్డులో నిర్జన ప్రదేశంలో మహిళ శవాన్ని స్థానికులు గుర్తించారు.

హైదరాబాద్‌లో మహిళ దారుణ హత్య..
Hyderabad News

హైదరాబాద్, అక్టోబర్ 7: నగరంలోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం గ్రామ సమీపంలో మహిళ దారుణ హత్యకు గురైంది. ఇందు అరణ్య విల్లాస్ ఎదురుగా కొత్త రోడ్డులో నిర్జన ప్రదేశంలో మహిళ శవాన్ని స్థానికులు గుర్తించారు. అయితే ఒంటిపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు నాగోల్ పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహం పక్కన మధ్య బాటిళ్లను గుర్తించారు.


మృతదేహనికి కాళ్లు, చేతులు కనిపించకపోవడం కలకలం రేపింది. కుక్కలు పీక్కుతింటూ ఉండగా చూనసిట్లు మార్నింగ్ వాకర్స్‌ చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతురాలు ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు. మహిళ కనిపించడం లేదంటూ గత నెల 28న ఓయూ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.


మహిళ హత్యపై నాగోల్ ఇన్‌స్పెక్టర్ వివరణ..

నాగోల్ 100 ఫీట్ రోడ్లో మహిళ మృతదేహం ఉన్నట్టు డయల్ 100 ద్వారా సమాచారం అందిందని నాగోల్ ఇన్‌స్పెక్టర్ మక్బూల్ జానీ తెలిపారు. అరుణ్ అనే వ్యక్తి బహిర్భూమికి వచ్చి మహిళ మృతదేహం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు. మృతదేహం వద్ద ఆధారాలు సేకరించి పోస్టుమార్టం కోసం తరలించామని తెలిపారు. మృతిచెందిన మహిళను ఓయూ పోలీస్ స్టేషన్ పరిధి మాణికేశ్వర్‌ నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించామన్నారు. ఈనెల 29వ తేదీన క్యాటరింగ్ వర్క్ కోసం మంగమ్మ బయటికి వెళ్లిందని.. అదేరోజు ఆమె హత్యకు గురైనట్టు భావిస్తున్నామని తెలిపారు.


డెడ్‌బాడీ లభ్యమైన ప్రాంతంలో ఆమె ఆధార్ కార్డు దొరికిందని చెప్పారు. దాన్ని బట్టి మృతదేహం మంగమ్మదిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామన్నారు. మృతదేహానికి కాళ్లు, చేతులు లేవని.. కుక్కలు పీక్కు తిని ఉండవచ్చని అన్నారు. ఆమె హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని నాగోల్ ఇన్‌స్పెక్టర్ మక్బూల్ జానీ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

ఢిల్లీ తరువాత విజయవాడలో సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని

ఎర్రవల్లి సర్వే నంబర్ 325లో 45.5 ఎకరాల వ్యత్యాసం.. నివేదికపై సీఎం రేవంత్ ఆరా

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 01:44 PM