Share News

ఆసియాడ్: పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు మోదీ అభినందనలు

ABN , Publish Date - Oct 05 , 2026 | 07:06 AM

ఆసియా క్రీడలు 2026లో అద్భుత ప్రదర్శన చేసిన భారత అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.

ఆసియాడ్: పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు మోదీ అభినందనలు
Narendra Modi

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడలు 2026లో అద్భుత ప్రదర్శన చేసిన భారత అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఆదివారం ఆసియా క్రీడల ముగింపు వేడుకలు ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. భారత్ 85 పతకాలతో పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలు ఉన్నాయి.


‘జపాన్‌లోని అయిచి-నగోయా వేదికగా జరిగిన ఆసియాడ్ 2026 ముగిసిన సందర్భంగా భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన ప్రతి అథ్లెట్‌కు అభినందనలు. పట్టుదల, ఉత్సాహంతో పోటీపడి దేశానికి గర్వకారణంగా నిలిచారు. భారత అథ్లెట్ల ప్రదర్శనలు రానున్న రోజుల్లో మరిన్ని విజయాలకు స్ఫూర్తినివ్వాలి. క్రీడలను క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు ఈ ఆసియాడ్ ఉపయోగపడుతుంది. ఇందులో సాధించిన అనుభవం.. రాబోయే అంతర్జాతీయ టోర్నీలతో పాటు ఒలింపిక్స్‌ కోసం భారత క్రీడాకారుల సన్నద్ధతకు ఉపయోగపడుతుంది’ అని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

కోల్‌కతాలో బ్రెజిల్ ఫుట్‌బాల్ ఫీవర్.. భారత్‌తో మ్యాచ్‌కు సాల్ట్ లేక్ స్టేడియం సిద్ధం

ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. మలేషియాపై 5-1 ఘన విజయం, హాకీలో స్వర్ణం..

Updated Date - Oct 05 , 2026 | 07:07 AM