ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. మలేషియాపై 5-1 ఘన విజయం, హాకీలో స్వర్ణం..
ABN , Publish Date - Oct 03 , 2026 | 06:08 PM
ఆసియా క్రీడలు 2026లో ఇవాళ(శనివారం)కూడా భారత్ ఖాతాలో పసిడి పతకాలు వెల్లువెత్తాయి. హాకీలోనూ భారత్ స్వర్ణం సాధించింది.
ఆసియా క్రీడలు 2026లో ఇవాళ(శనివారం)కూడా భారత్ ఖాతాలో పసిడి పతకాలు వెల్లువెత్తాయి. హాకీలోనూ భారత్ స్వర్ణం(Asian Games 2026 Hockey Gold) సాధించింది. నిన్న(శుక్రవారం) హాకీ మహిళల విభాగంలో భారత్ గోల్డ్ మెడల్ సాధించింది. దాదాపు 44 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇండియా పసిడి పట్టింది. తాజాగా పురుషుల విభాగంలోనూ భారత జట్టు సత్తాచాటింది. మలేషియాపై విజయం సాధించింది మరో స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది.
ఇవాళ(శనివారం) ఐచి-నగోయా వేదికగా భారత్, మలేషియా మధ్య తుదిపోరు జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత హాకీ జట్టు 5-1 తేడాతో మలేషియాను చిత్తు చేసింది. ఈ విజయంతో స్వర్ణం గెలవడంతో పాటు చరిత్రలో తొలిసారి తమ ఆసియా టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకుంది. ఆట ఆరంభం నుంచి ఇరుజట్లూ గోల్స్ కోసం పోటీ పడ్డాయి. 11వ నిమిషంలో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ హెనాల్టీ కార్నర్‌ను గోల్ గా మలిచాడు. దీంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
అయితే 14వ నిమిషంలో మలేషియా గోల్ సాధించి పాయింట్లు సమం చేసింది. 23వ నిమిషంలో భారత్ ప్లేయర్ లక్రా గోల్ కొట్టాడు. ఇక అక్కడి నుంచి మలేషియాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా భారత ప్లేయర్లు అదరగొట్టారు. మొత్తంగా ఐదు గోల్స్ చేసి విజయం ఖాయం చేసుకున్నారు. దీంతో ఒకే ఎడిషన్ లో మహిళల, పురుషుల విభాగంలో బంగారు పతకం సాధించడం ఇదే తొలిసారి. తాజాగా గెలుపుతో భారత్ 2028 లాస్ ఏంజిల్స్ లో జరిగే ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించింది.
ఇవి కూడా చదవండి:
ఆసియా క్రీడలు 2026: రెజ్లింగ్‌లో అమన్ సెహ్రావత్‌కు స్వర్ణం.. భారత్ ఖాతాలో 20వ గోల్డ్
రోహిత్ శర్మ సంచలనం.. సచిన్ 22 ఏళ్ల రికార్డు బ్రేక్
ఆసియా క్రీడలు 2026: పాకిస్థాన్‌పై భారత్ బద్దలు కొట్టిన రికార్డులు ఇవే!