ఆసియా క్రీడలు 2026: రెజ్లింగ్‌లో అమన్ సెహ్రావత్‌కు స్వర్ణం.. భారత్ ఖాతాలో 20వ గోల్డ్
ABN , Publish Date - Oct 03 , 2026 | 04:55 PM
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత్ క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. శుక్రవారం ఏకంగా ఆరు స్వర్ణాలు భారత్ ఖాతాలో చేరాయి. అదే ఊపు శనివారం కూడా కొనసాగుతోంది.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత్ క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. నిన్న(శుక్రవారం)ఏకంగా ఆరు స్వర్ణాలు భారత్ ఖాతాలో చేరాయి. అదే ఊపు శనివారం కూడా కొనసాగుతోంది. ఉదయం క్రికెట్ పురుషుల విభాగంలో టీమిండియా పసిడి పతకం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో స్వర్ణం భారత్ ఖాతాలో చేరింది. రెజ్లింగ్‌లో భారత్ గోల్డ్ మెడల్ గెలిచింది.
భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్(Aman Sehrawat gold medal) పసిడి పతకం సాధించాడు. అమన్ దెబ్బకు ఉత్తర కొరియా ఆటగాడు, వరల్డ్ ఛాంపియన్ చాంగ్ సాంగ్ హాన్ తలవంచాడు. రెజ్లింగ్ పురుషుల 57 కేజీల విభాగంలో 11-7 తేడాతో చాంగ్‌ను అమన్ ఓడించాడు. ఆట ప్రారంభంలో హాన్ చాలా దూకుడుగా, పదేపదే దాడులకు దిగాడు. అయితే, సెహ్రావత్ పట్టుదల చివరికి అతడికి స్వర్ణం సాధించింది పెట్టింది. చాలా సమయం పాటు 6-1 ఆధిక్యంలో ఉన్న అమన్.. హాన్ కాస్త వెనుకంజ వేశాడు. హాన్ పోరాడి కాసేపు 6-7 తేడాతో ఆధిక్యంలో నిలిచాడు. అయితే తిరిగి పుంజుకున్న అమన్.. హాన్ ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 11-7తేడాతో ఆటను ముగించాడు.
మరోవైపు ఇవాళ ఆర్చరీ, గోల్ప్ ,క్రికెట్ విభాగాల్లో భారత్ కు స్వర్ణాలు రాగా.. తాజాగా రెజ్లింగ్‌లోనూ పసిడి పంట పడింది. దీంతో భారత్‌కు దక్కిన బంగారు పతకాల సంఖ్య 20కి చేరింది. ప్రస్తుతం85 పతకాల పట్టికలో భారత్ 5వ స్థానంలో ఉంది. 20 బంగారం, 26 రజతంతో సహా మొత్తం 82 పతకాలను సొంతం చేసుకుంది. ఆసియా క్రీడల ముగింపుకు మరో రోజు ఉండటంతో మరిన్ని స్వర్ణాలు భారత ఖాతాలో చేరుతాయని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
రోహిత్ శర్మ సంచలనం.. సచిన్ 22 ఏళ్ల రికార్డు బ్రేక్
ఆసియా క్రీడలు 2026: పాకిస్థాన్‌పై భారత్ బద్దలు కొట్టిన రికార్డులు ఇవే!