Share News

ఆసియా క్రీడలు 2026: పాకిస్థాన్‌పై భారత్ బద్దలు కొట్టిన రికార్డులు ఇవే!

ABN , Publish Date - Oct 03 , 2026 | 03:34 PM

ఆసియా క్రీడలు 2026లో భాగంగా భారత్ ఖాతాలో 19వ గోల్డ్ మెడల్ చేరింది. ఇవాళ(శనివారం) పాక్‌తో జరిగిన పురుషుల క్రికెట్లో భారత్ విజయం సాధించింది. ఈ క్రమంలో టీమిండియా పలు రికార్డులు బద్దలు కొట్టింది.

ఆసియా క్రీడలు 2026: పాకిస్థాన్‌పై భారత్ బద్దలు కొట్టిన రికార్డులు ఇవే!
India vs Pakistan final

స్పోర్ట్స్ డెస్క్: ఆసియా క్రీడలు 2026లో భాగంగా భారత్ ఖాతాలో 19వ గోల్డ్ మెడల్ చేరింది. ఇవాళ(శనివారం) పాక్‌తో జరిగిన పురుషుల క్రికెట్లో భారత్ విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు సాధించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ తడబడింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 192 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 19 పరుగుల తేడాతో టీమ్ఇండియా గెలుపొంది.. మరోసారి పసిడి పతకాన్ని ముద్దాడింది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారత్ పలు రికార్డులను బద్దలు కొట్టింది. మరి.. ఆ రికార్డుల వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...


  • 211/6: భారత్-పాకిస్థాన్ టీ20లలో అత్యధిక తొలి ఇన్నింగ్స్

  • 81/2: టీ20ఐలలో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన అత్యధిక పవర్‌ప్లే స్కోరు

  • సాద్ మసూద్(పాక్) 24 పరుగులు: భారత్-పాకిస్థాన్ టీ20లో అత్యంత ఖరీదైన ఓవర్

  • 18 ఓవర్లు: ఒక పూర్తి సభ్య జట్టు ద్వారా ఒక టీ20ఐ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్పిన్ ఓవర్లు

  • అభిషేక్ శర్మ(20 బంతుల్లో 50 పరుగులు): టీ20ఐలలో పాకిస్థాన్‌పై ఒక భారతీయుడు సాధించిన అత్యంత వేగవంతమైన అర్ధశతకం

  • అభిషేక్ శర్మ 7 సిక్సర్లు: భారత్-పాకిస్థాన్ టీ20ఐ ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత సిక్సర్లు(గతంలో యువరాజ్ సింగ్)

  • అభిషేక్ శర్మ(104* సిక్సర్లు): టీ20 క్రికెట్‌లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఒక భారతీయుడు కొట్టిన అత్యధిక సిక్సర్లు


  • అభిషేక్ శర్మ(3,513 బంతులు): టీ20 క్రికెట్‌లో 400 సిక్సర్లు కొట్టడానికి పట్టిన అతి తక్కువ బంతులు

  • తొలి స్థానంలో ఆండ్రీ రస్సెల్ ఉన్నాడు. 400 సిక్సర్లు కొట్టడానికి అతడు 3,027 బంతులు తీసుకున్నాడు.

  • ఒక క్యాలెండర్ సంవత్సరంలో 1,000 కంటే ఎక్కువ పురుషుల టీ20I పరుగులు సాధించిన భారతీయ బ్యాటర్లు: సూర్యకుమార్ యాదవ్(2022లో 1,164 పరుగులు)ఇషాన్ కిషన్(2026లో 1,005 పరుగులు)

  • పాకిస్థాన్ పై భారత్ చేసిన 211/6 స్కోర్ ఐదు లేదా అంతకంటే ఎక్కువ జట్లు పాల్గొనే టీ20 టోర్నమెంట్ ఫైనల్‌లో పూర్తి సభ్య జట్టు సాధించిన రెండో అత్యధిక స్కోరు గతంలో న్యూజిలాండ్‌ పై భారత్ చేసిన 255/5 స్కోర్ అత్యధికం.


ఇవి కూడా చదవండి..

శ్రీసిటీలో ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

శ్రీసిటీ బాయిలర్ పేలుడు.. సేఫ్టీ ఆడిట్‌కు పవన్ కల్యాణ్ ఆదేశాలు

Updated Date - Oct 03 , 2026 | 03:39 PM