Share News

శ్రీసిటీలో ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

ABN , Publish Date - Oct 03 , 2026 | 11:36 AM

తిరుపతి జిల్లా శ్రీసిటీలోని ప్రైవేట్ పరిశ్రమలో వాటర్ బాయిలర్ పేలి నలుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

శ్రీసిటీలో ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
CM Chandrababu

అమరావతి, అక్టోబర్ 3: తిరుపతి జిల్లా శ్రీసిటీలోని ప్రైవేట్ పరిశ్రమలో వాటర్ బాయిలర్ పేలి నలుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ప్రైవేటు పరిశ్రమలో బాయిలర్ పేలిన సమయంలో ఘటనా స్థలంలోనే ఇద్దరు చనిపోయారని, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని అధికారులు చెప్పారు. దీంతో మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.


తీరని విషాదం: మంత్రి లోకేశ్

శ్రీసిటీలోని ప్రైవేటు ఫ్యాక్టరీలో ప్రమాదంపై ‘ఎక్స్’ వేదికగా మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. బాయిలర్ పేలి కార్మికులు మృతి చెందడం, మరికొందరు గాయపడటం తీరని విషాదమని అన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు లోకేశ్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరుతూ... మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు.


కార్మికుల మృతి బాధాకరం: అనిత

శ్రీసిటీలో ప్రమాదంపై హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై తిరుపతి జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడారు. బాయిలర్ పేలి కార్మికులు మృతిచెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు హోం మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను అనిత ఆదేశించారు.


ఇవి కూడా చదవండి..

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు.. 3.3 కిలోల గంజాయి స్వాధీనం

విజయవాడలో పాన్‌ ఐఐటీ ఏపీ సమ్మిట్‌ 2026 ప్రారంభం.. కీలక రంగాలపై చర్చలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 03 , 2026 | 12:14 PM