Share News

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు.. 3.3 కిలోల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Oct 03 , 2026 | 10:58 AM

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని మైలార్‌దేవ్‌పల్లిలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు.. 3.3 కిలోల గంజాయి స్వాధీనం
Mylardevpally Ganja

హైదరాబాద్, అక్టోబర్ 3: రాజేంద్రనగర్‌లోని మైలార్‌దేవ్‌పల్లిలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ చార్మినార్ జోన్, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. దాదాపు 3.3 కిలోల గంజాయి, 2 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంజమాముల్ హక్, అనీష్ కుమార్ షా అనే వ్యక్తులు జార్ఖండ్ నుంచి రైలులో గంజాయిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజేంద్రనగర్ పరిధిలోని ఆరాంగఢ్ ఎక్స్ రోడ్ వద్ద నిందితులు పట్టుబడ్డారు.


వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.1.80 లక్షలు ఉంటుందని అంచనా. జార్ఖండ్ యువకులు ఇద్దరు.. కొంపల్లిలో నివాసముంటూ క్యాటరింగ్ పనులు చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈజీ మనీ కోసం గంజాయి దందాకు దిగినట్లు పోలీసులు గుర్తించారు. రూ.13 వేలకు కిలో గంజాయి కొని.. హైదరాబాద్‌లో రూ.20 వేల వరకు విక్రయిస్తున్నట్లు విచారణలో బయటపడింది. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని.. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

మేడ్చల్‌లో రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొన్న కారు, భర్త మృతి

‘మీ ధైర్యసాహసాలకు వందనాలు’.. కెప్టెన్ స్మిత్ మచ్చార్‌‌పై చిరంజీవి ప్రశంసలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 03 , 2026 | 11:11 AM