Share News

గ్రామకంఠాల మినహాయింపులపై చంద్రబాబు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Oct 03 , 2026 | 10:10 AM

అమరావతి పరిధిలో 2014-19 మధ్య నోటిఫై చేసిన గ్రామకంఠాల మినహాయింపులను పునఃపరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మినహాయింపులు సీఆర్డీఏ నిబంధనలకు అనుగుణంగా జరిగాయా లేదా పరిశీలించి నివేదిక ఇవ్వాలని సూచించారు.

గ్రామకంఠాల మినహాయింపులపై చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Chandrababu on amaravathi gramakantalu

అమరావతి, అక్టోబర్ 3: ప్రభుత్వం అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో అమరావతి పరిధిలో భూముల సమీకరణను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో అమరావతి పరిధిలోని పలు గ్రామాలను, వాటిని ఆనుకుని ఉన్న పశువుల కొట్టాలను గ్రామకంఠాల కింద పరిగణించి.. భూసమీకరణ నుంచి మినహాయించారు. అయితే.. తమ భూములను కూడా గ్రామకంఠాల కింద పరిగణించి.. భూసమీకరణ నుంచి మినహాయించాలని కొందరు రైతులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు సీఆర్డీఏ రూపొందించిన నిబంధనలను అనుసరించి.. ప్రభుత్వం కొంతమంది రైతుల భూముల మినహాయింపునకు అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


ఈ నేపథ్యంలో సీఆర్డీఏ రూపొందించిన నిబంధనలకు విరుద్ధంగా రైతుల భూములను మినహాయింపు చేశారని కొన్ని గ్రామాల వారు మంత్రి నారాయణకు ఫిర్యాదు చేశారు. గ్రామకంఠాల మినహాయింపులలో జరిగిన అవకతవకలపై మంత్రి నారాయణ ముఖ్యమంత్రితో చర్చించిన అనంతరం.. చంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమరావతి గ్రామకంఠాల మినహాయింపులను పునః పరిశీలించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మినహాయింపులు నిబంధనలకు అనుగుణంగా జరిగాయా లేదా అన్న అంశాన్ని లోతుగా పరిశీలించి.. సీఆర్డీఏకు నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కల్యాణలక్ష్మి రద్దుకు రేవంత్‌ కుట్ర

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 03 , 2026 | 10:54 AM