Share News

కల్యాణలక్ష్మి రద్దుకు రేవంత్‌ కుట్ర: కేటీఆర్‌

ABN , Publish Date - Oct 03 , 2026 | 06:41 AM

కల్యాణలక్ష్మి పథకంతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీని విస్మరించడమే కాకుండా, అసలు ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేసేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి కుట్ర పన్నుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

కల్యాణలక్ష్మి రద్దుకు రేవంత్‌ కుట్ర: కేటీఆర్‌
Ktr

హైదరాబాద్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): కల్యాణలక్ష్మి పథకంతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీని విస్మరించడమే కాకుండా, అసలు ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేసేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి కుట్ర పన్నుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు ప్రారంభమై శుక్రవారం నాటికి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఎక్స్‌ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పన్నెండేళ్ల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 16.78 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరిందని గుర్తుచేశారు. ఆడబిడ్డ పెళ్లి సమయంలో తల్లిదండ్రులపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించిందని తెలిపారు. అయితే, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగార్చడమే కాకుండా, భవిష్యత్తులో దానిని పూర్తిగా లేకుండా చేయాలని ప్రయత్నించడం తగదని కేటీఆర్‌ హెచ్చరించారు.

Updated Date - Oct 03 , 2026 | 06:43 AM