మేడ్చల్‌లో రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొన్న కారు, భర్త మృతి
ABN , Publish Date - Oct 03 , 2026 | 10:06 AM
మేడ్చల్ జిల్లాలోని పేట్ బషీర్‌బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
మేడ్చల్ జిల్లా, అక్టోబర్ 3: జిల్లాలోని పేట్ బషీర్‌బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సుచిత్ర సెంటర్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సమీపంలోని యూ టర్న్ వద్ద ఈ ఘటన జరిగింది. అర్జున్ సర్దా (38), గుర్జన్ సర్దా (34) అనే దంపతులు సినిమా చూసి బైక్‌పై ఇంటికి తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను.. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన అర్జున్ సర్దా పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. భార్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్.. కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. కారు దొరికినా కూడా యజమానిని అరెస్ట్ చేయలేదని పోలీసులపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు అర్జున్ కొంపల్లిలో 6 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నాడు. ఈ ప్రమాదంపై పేట్ బషీర్‌బాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న ఏపీ ప్రభుత్వం
వికారాబాద్‌లో విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య
Read Latest Telangana News And Telugu News