Share News

వేగంగా కొత్త పెట్టుబడుల గ్రౌండింగ్‌

ABN , Publish Date - Oct 03 , 2026 | 05:42 AM

రాష్ట్రానికి కొత్తగా వస్తున్న పారిశ్రామిక పెట్టుబడులను త్వరితగతిన కార్యరూపంలోకి (గ్రౌండింగ్‌) తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని జిల్లాల్లో జాయింట్‌ కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేసింది.

వేగంగా కొత్త పెట్టుబడుల గ్రౌండింగ్‌

అమరావతి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి కొత్తగా వస్తున్న పారిశ్రామిక పెట్టుబడులను త్వరితగతిన కార్యరూపంలోకి (గ్రౌండింగ్‌) తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని జిల్లాల్లో జాయింట్‌ కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయాలని, అందుబాటులో ఉన్న పారిశ్రామిక భూములను సమర్థంగా వినియోగించాలంటూ సీఎం చంద్రబాబు గత మేలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో చేసిన దిశానిర్దేశం మేరకు ఈ చర్యలు చేపట్టారు. ఈ జిల్లాస్థాయి కమిటీలు రాష్ట్రం అందుబాటులో ఉన్న పారిశ్రామిక భూములను గుర్తించడం, వాటిని అభివృద్ధి చేసేందుకు అనుగుణంగా వర్గీకరించడం, కొత్త ఆర్థిక క్లస్టర్లు, నోడ్‌లను ఏర్పాటు చేయడం వంటి పనులు చేయనున్నాయి. ఈ కమిటీకి జేసీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ సభ్య కన్వీనర్లుగా ఉంటారు. డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌, సెర్ప్‌ జిల్లా ప్రతినిధి, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌ సభ్యులుగా ఉంటారు.

ఈ వార్తలనూ చదవండి..

స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు

శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు

Updated Date - Oct 03 , 2026 | 05:42 AM