Share News

శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు

ABN , Publish Date - Oct 03 , 2026 | 01:19 AM

పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణలో జిల్లాకు మూడు రాష్ట్రస్థాయి స్వచ్ఛ అవార్డులు వచ్చాయి

శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు
సీఎం చంద్రబాబు నుంచి అవార్డు అందుకుంటున్న టీటీడీ జేఈవో శరత్‌కుమార్‌, హెల్త్‌ డిప్యూటీ ఈవో సోమన్నారాయణ

తిరుమల/తిరుపతి సెంట్రల్‌/రేణిగుంట, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణలో జిల్లాకు మూడు రాష్ట్రస్థాయి స్వచ్ఛ అవార్డులు వచ్చాయి. వీటిలో తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుపతి ప్రకాశం రోడ్డులోని యూపీహెచ్‌సీ, రేణిగుంట మండలం గాజులమండ్యం పారిశ్రామికవాడలోని హాంగ్యో ఐస్‌క్రీం పరిశ్రమ ఉన్నాయి. గాంధీ జయంతిని పురస్కరించుకుని విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. సీఎం చంద్రబాబు చేతులమీదుగా మొదటి స్థానంలో నిలిచిన టీటీడీకి సంబంధించిన అవార్డును జేఈవో శరత్‌కుమార్‌, హెల్త్‌ డిప్యూటీఈవో సోమన్నారాయణ అందుకున్నారు. అలాగే యూపీహెచ్‌సీ అవార్డును డీఎంహెచ్‌వో బాలకృష్ణ నాయక్‌, డాక్టర్‌ క్రాంతి అందుకున్నారు. హాంగ్యో పరిశ్రమకు సంబంధించిన అవార్డును చైర్మన్‌ దినేష్‌ స్వీకరించారు.

Updated Date - Oct 03 , 2026 | 01:19 AM