Share News

వికారాబాద్‌లో విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య

ABN , Publish Date - Oct 03 , 2026 | 09:49 AM

వికారాబాద్ జిల్లాలోని పూడురు మండలం సోమన్‌గర్తి సమీపంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి తన బిడ్డలతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

వికారాబాద్‌లో విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య
Vikarabad

వికారాబాద్ జిల్లా, అక్టోబర్ 3: జిల్లాలోని పూడురు మండలం సోమన్‌గర్తి సమీపంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మమత అనే మహిళ తన ఇద్దరు పిల్లలు సాకేత్(8), జనశ్రీ(4)తో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. పుట్టిళ్లు నారాయణపూర్ గ్రామానికి వెళ్తున్నానని భర్తతో చెప్పి కొడుకు, కూతురిని తీసుకుని మమత ఇంటి నుంచి బయలుదేరింది. అయితే మార్గమధ్యలో సోమన్‌గర్తి గ్రామ సమీపంలో పిల్లలతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సమయం గడుస్తున్నప్పటికీ మమత నుంచి సమాచారం లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.


ఆమె కోసం వెతుకగా సోమన్‌గర్తి సమీపంలో పిల్లలతో కలిసి మమత బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో బావిలో దూకిన ఈతగాళ్లు తల్లి మమత, కూతురు జనశ్రీ మృతదేహాలను వెలికితీశారు. కొడుకు సాకేత్ మృతదేహం కోసం బావిలో గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరీశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే కుటుంబ కలహాలే ఆత్మహత్యలకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు చిన్నారులతో మమత ప్రాణాలు తీసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ఆసియా క్రీడలు: ఆర్చరీలో మరో గోల్డ్.. తొలి భారత మహిళగా కుంకుమ్‌ చరిత్ర

బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న ఏపీ ప్రభుత్వం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 03 , 2026 | 09:53 AM