Share News

బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న ఏపీ ప్రభుత్వం

ABN , Publish Date - Oct 03 , 2026 | 07:46 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల 34 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును ఏపీ సర్కార్ నేడు సుప్రీంకోర్టులో సవాలు చేయనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న ఏపీ ప్రభుత్వం
ap govt to file a petition in sc on bc reservation

అమరావతి, అక్టోబర్ 3: ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ.. జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ రోజు (శనివారం) మధ్యాహ్నానికి పిటిషన్ ఫైల్ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.


ఈ మేరకు సీఎం చంద్రబాబు.. ఢిల్లీలోని న్యాయ నిపుణులను సంప్రదించినట్లు తెలుస్తోంది. పంచాయతీరాజ్, పురపాలక శాఖ తరఫున వాదించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులను నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ వారంలో పిటిషన్ దాఖలు చేస్తే.. వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఈరోజే పిటిషన్ ఫైల్ చేయాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

కల్యాణలక్ష్మి రద్దుకు రేవంత్‌ కుట్ర

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 03 , 2026 | 09:09 AM