అనకాపల్లి రోడ్డు ప్రమాదం.. ట్రాలీని ఢీకొన్న వ్యాన్, ఇద్దరి మృతి
ABN , Publish Date - Oct 03 , 2026 | 08:08 AM
అనకాపల్లి జిల్లాలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. యలమంచిలి మండలం మర్రిబంద జంక్షన్ వద్ద రోడ్డు పక్కన నిలిచి ఉన్న ట్రాలీని ఫ్రూట్స్ లోడ్‌తో వెళ్తున్న టాటా ఇంట్రా వ్యాన్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. వివరాల్లోకి వెళితే..
అనకాపల్లి, అక్టోబర్ 3: జిల్లాలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. యలమంచిలి మండలం మర్రిబంద జంక్షన్ వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రాలీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఫ్రూట్స్ లోడ్ టాటా ఇంట్రా వ్యాన్ బలంగా ఢీకొట్టింది. తుని వైపు నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్న టాటా ఇంట్రా వ్యాన్ (AP 39 WR 3630) అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాలీ (OD 07 BG 0870)ను ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఢీకొన్న వేగానికి వ్యాన్ ముందు భాగం తీవ్రంగా దెబ్బతినగా, అందులో ఉన్న డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతులు గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందినవారిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను ప్రమాదానికి గురైన వాహనం నుంచి బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రోడ్డు పక్కన ట్రాలీని నిలిపి ఉంచిన పరిస్థితులు, టాటా ఇంట్రా వ్యాన్ వేగం, డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి:
కల్యాణలక్ష్మి రద్దుకు రేవంత్ కుట్ర
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
Read Latest AP News And Telangana News