Share News

‘మీ ధైర్యసాహసాలకు వందనాలు’.. కెప్టెన్ స్మిత్ మచ్చార్‌‌పై చిరంజీవి ప్రశంసలు

ABN , Publish Date - Oct 03 , 2026 | 10:27 AM

ఇజ్రాయెల్‌కు వెళ్తున్న విమానంలో దాడి జరిగిన సమయంలో తీవ్రంగా గాయపడినా.. తోటి ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు.

‘మీ ధైర్యసాహసాలకు వందనాలు’.. కెప్టెన్ స్మిత్ మచ్చార్‌‌పై చిరంజీవి ప్రశంసలు
Megastar Chiranjeevi

హైదరాబాద్, అక్టోబర్ 3: ఇజ్రాయెల్‌కు వెళ్తున్న విమానంలో దాడి జరిగిన సమయంలో తీవ్రంగా గాయపడినా.. తోటి ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఎందరో ప్రాణాలను ఒక్కడై పోరాడిన స్మిత్ సాహసం ప్రతి భారతీయుడికీ గర్వకారణమన్నారు. మచ్చార్ త్వరగా పూర్తిగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని చిరంజీవి మనస్ఫూర్తిగా కోరుకున్నారు.


‘తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా, తోటి వారి ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు నా హృదయపూర్వక అభినందనలు. ఇజ్రాయెల్‌కు వెళ్తున్న విమానంలో దాడికి గురై, తీవ్రంగా గాయపడిన స్థితిలోనూ సమయస్ఫూర్తితో స్పందించి, ఎందరో ప్రాణాలను ఒక్కడై పోరాడిన మీ సాహసం ప్రతి భారతీయుడికీ గర్వకారణం. ఆ క్లిష్ట సమయంలో హనుమాన్ చాలీసా పఠిస్తూ మనోధైర్యాన్ని కూడగట్టుకున్నారని తెలిసి నా మనసు చలించింది. ఆ ఆంజనేయస్వామి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని, మీరు త్వరగా పూర్తిగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ధైర్యసాహసాలకు, మానవత్వానికి నా హృదయపూర్వక వందనాలు. జై హనుమాన్’ అంటూ ఎక్స్‌లో మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

వికారాబాద్‌లో విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య

మేడ్చల్‌లో రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొన్న కారు, భర్త మృతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 03 , 2026 | 11:10 AM