Share News

బొల్లారం ఆయుధాల చోరీ.. బంగ్లాదేశ్ డీలర్‌తో మల్లేశ్‌కు లింకులు

ABN , Publish Date - Oct 03 , 2026 | 09:36 AM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్‌లోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు మల్లేశ్‌ను విచారిస్తున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి.

బొల్లారం ఆయుధాల చోరీ.. బంగ్లాదేశ్ డీలర్‌తో మల్లేశ్‌కు లింకులు

హైదరాబాద్, అక్టోబర్ 03: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్‌లోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు మల్లేశ్‌ను విచారిస్తున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి. నిందితుడు మల్లేశ్‌కు బంగ్లాదేశ్ ఆయుధాల డీలర్ ఓబితో లింకులు ఉన్నట్లు ఈ విచారణలో బహిర్గతమైంది. చోరీ చేసిన ఆర్మీ ఆయుధాలు విక్రయించేందుకు బంగ్లాదేశ్‌కు చెందిన ఒబితో అతడు మంతనాలు, బేరసారాలు సాగించాడు. వీరిద్దరికి కోల్‌కతాకు చెందిన బీర్బల్ షా మధ్యవర్తిత్వం నిర్వహించాడు.


చోరీ చేసిన ఆయుధాల్లో 4 ఏకే-47లు అమ్మిపెడితే రూ.5 లక్షలు, పిస్టళ్లకు రూ.3 లక్షల కమిషన్ ఇవ్వాలని మల్లేశ్‌ను బీర్బల్ కోరారు. ఇక ఈ ఆయుధాల చోరీకి మల్లేశ్‌కు మరో ముగ్గురు ఆర్మీ జవాన్లు సహకరించారు. ఆయుధాల చోరీ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసేందుకు మల్లేశ్‌కు ఇద్దరు జవాన్లు సహకరించారు. ఈ చోరీ పథక రచన అమలులో భాగంగా వారం రోజుల పాటు మద్రాస్ రెజిమెంట్‌ ఆయుధాలున్న ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను మరో జవాన్ ఆపివేశారు. ఇక ఈ కేసులో బీర్బల్ షా, ఒబిల కోసం పోలీసులు ఆరు బృందాలను రంగంలోకి దింపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తండ్రి సూపర్ ఐడియా.. జెడ్ ప్లస్ సెక్యూరిటీ అంటూ నెటిజన్లు కామెంట్స్

బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న ఏపీ ప్రభుత్వం

Updated Date - Oct 03 , 2026 | 09:46 AM