Share News

తండ్రి సూపర్ ఐడియా.. జెడ్ ప్లస్ సెక్యూరిటీ అంటూ నెటిజన్లు కామెంట్స్

ABN , Publish Date - Oct 03 , 2026 | 08:01 AM

భార్యభర్తలకు తల్లిదండ్రులుగా ప్రమోషన్ వచ్చిన తర్వాత.. పిల్లలే వారికి లోకం. వారి ఆరోగ్యం, చదువు, భవిష్యత్తే లక్ష్యంగా నిర్దేశించుకుంటారు. చిన్నారులను బయటకు తీసుకెళ్లేటప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

తండ్రి సూపర్ ఐడియా.. జెడ్ ప్లస్ సెక్యూరిటీ అంటూ నెటిజన్లు కామెంట్స్

ఇంటర్నెట్ డెస్క్: భార్యభర్తలకు తల్లిదండ్రులుగా ప్రమోషన్ వచ్చిన తర్వాత.. పిల్లలే వారికి లోకం. వారి ఆరోగ్యం, చదువు, భవిష్యత్తే లక్ష్యంగా నిర్దేశించుకుంటారు. చిన్నారులను బయటకు తీసుకెళ్లేటప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక వర్షంలో వారిని బయటకు తీసుకెళ్లాలంటే.. చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తారు. అలాంటి తండ్రి తీసుకున్న జాగ్రత్తల వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. చుట్టూ పచ్చని చెట్లు మధ్య జోరుగా వర్షం పడుతోంది. తన కుమార్తె ఎక్కడ వర్షంలో తడుస్తుందో అని.. అతను తీసుకున్న జాగ్రత్తలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.


గొడుగు పైనుంచి దాదాపు కింద వరకు పాలిథిన్ కవర్ రౌండ్‌గా చుట్టేశాడు. గొడుగు పైభాగంలో ముడి వేసి.. కింద వరకు దానిని వేలాడ దీశాడు. దీంతో అతడితో పాటు ఆ చిన్నారిపై చిన్న చినుకు కూడా పడలేదు. ఇలా తన కూతురిపై వర్షం పడకుండా వినూత్నంగా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇలా చేయడం వల్ల వర్షం వచ్చే సమయంలో.. ఈదురు గాలుల నుంచి కూడా ఆ చిన్నారికి రక్షణ లభించినట్లు అయింది.


ఇలా ఆ గొడుకు కింద తన కుమార్తెను ఎత్తుకుని సరదాగా, తాపీగా నడుస్తూ వెళ్లాడు. ఈ వీడియోను vihaaneditz95 ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. భారతీయుల తెలివితేటలతో ఎవరూ పోటీ పడలేరని ఒకరు కామెంట్ చేశారు. దీనిని జెడ్ ప్లస్ సెక్యూరిటీ అంబ్రెల్లా అంటారని మరొకరు పేర్కొన్నారు. పిల్లల కోసం తండ్రి తీసుకునే సంరక్షణ చర్యల్లో ఇదొక భాగమని వ్యాఖ్యానించారు. బిడ్డ ఆరోగ్యంపై అతడికి విపరీతమైన శ్రద్ధ ఉందని ఈ వీడియో చూస్తే అర్థమవుతోందని అంటున్నారు.

Updated Date - Oct 03 , 2026 | 09:48 AM