Share News

విజయవాడలో పాన్‌ ఐఐటీ ఏపీ సమ్మిట్‌ 2026 ప్రారంభం.. కీలక రంగాలపై చర్చలు

ABN , Publish Date - Oct 03 , 2026 | 11:13 AM

విజయవాడలో పాన్‌ ఐఐటీ ఏపీ సమ్మిట్ 2026 ప్రారంభమైంది. ఈరోజు మంత్రి నారా లోకేశ్ జ్యోతి ప్రజ్వలన చేసి పాన్ ఐఐటీ సమ్మిట్‌ను మొదలుపెట్టారు.

విజయవాడలో పాన్‌ ఐఐటీ ఏపీ సమ్మిట్‌ 2026 ప్రారంభం.. కీలక రంగాలపై చర్చలు
Pan IIT AP Summit

అమరావతి, అక్టోబర్ 3: విజయవాడలో పాన్‌ ఐఐటీ ఏపీ సమ్మిట్ 2026 ప్రారంభమైంది. ఈరోజు(శనివారం) మంత్రి నారా లోకేశ్ జ్యోతి ప్రజ్వలన చేసి పాన్ ఐఐటీ సమ్మిట్‌ను మొదలుపెట్టారు. ఐఐటీ డైరెక్టర్లు, ఐటీ నిపుణులు, విధాన నిర్ణేతలతో కీలక చర్చ జరగనుంది. అలాగే ఇంధనం, స్వచ్ఛాంధ్ర, డీప్‌టెక్‌, స్పేస్‌, ఏరోస్పేస్‌పై ప్యానెల్‌ చర్చలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఛైర్ ఆఫ్ ది సమ్మిట్ స్వదీప్ పిల్లారిశెట్టి మాట్లాడుతూ.. మొదటిసారి 20 సంవత్సారాల్లో విజయవాడలో అతిపెద్ద ఈవెంట్‌ను పాన్ ఐఐటి నిర్వహిస్తోందని తెలిపారు. దేశం నలుమూలల నుంచి ఐఐటీల డైరెక్టర్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఇది కాన్ఫరెన్స్ కాదని.. కన్వర్జెన్స్ అని అందరూ గుర్తించాలని తెలిపారు. ఇన్నోవేషన్, ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ రంగాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధి.. అభినందనలలో కాదని, బోర్డు రూమ్‌లలో జరిగే నిర్ణయాల ద్వారా అవుతుందని వెల్లడించారు. దీన్ని గుర్తించే ఏపీ ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తోందని స్వదీప్ తెలిపారు.


ఏపీని డెస్టినేషన్‌లా భావించండి: కాటంనేని భాస్కర్

పబ్లిక్ సర్వీస్‌ను మరింత సులభంగా అందించడంతో పాటు పాలనను సులభతరం చేసేందుకు పనిచేస్తున్నామని ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ అన్నారు. మంత్రి లోకేశ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ప్రభుత్వం తక్కవ కనిపించాలి.. పాలన అందించాలనే నినాదంతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు సంవత్సరాలుగా ఎన్నో ప్రోయాక్టివ్ పాలసీలు తీసుకువచ్చామన్నారు. సెమికండక్టర్, లిఫ్ట్ పాలసీ లాంటివి ఎన్నో తీసుకువచ్చామని తెలిపారు. కంపెనీలు బెస్ట్ టాలెంట్‌ను తీసుకువస్తే.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి మద్దతు ఇస్తోందన్నారు. ఏపీని ఒక డెస్టినేషన్‌లా భావించి ఇక్కడి అవకాశాలు అందింపుచ్చుకోవాలని సూచించారు. చర్చల తరువాత పాన్ ఐఐటీ అమరావతి డిక్లరేషన్‌‌కు సిద్ధం కావాలని కాటంనేని భాస్కర్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

‘మీ ధైర్యసాహసాలకు వందనాలు’.. కెప్టెన్ స్మిత్ మచ్చార్‌‌పై చిరంజీవి ప్రశంసలు

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు.. 3.3 కిలోల గంజాయి స్వాధీనం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 03 , 2026 | 11:38 AM