ఏపీ అభివృద్ధిలో టెక్నాలజీ వినియోగంపై సీఎం స్పెషల్ ఫోకస్
ABN , Publish Date - Oct 03 , 2026 | 04:24 PM
ఏపీ అభివృద్ధిలో టెక్నాలజీ వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫోకస్ పెట్టారు. విజయవాడ అంబేడ్కర్ కళావేదికలో శనివారం జరిగిన పాన్ ఐఐటీ సమ్మిట్‌లో టెక్నాలజీ ఆవిష్కరణలను సీఎం ప్రోత్సహించారు.
విజయవాడ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ఏపీ అభివృద్ధిలో టెక్నాలజీ వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) స్పెషల్ ఫోకస్ పెట్టారు. విజయవాడ అంబేడ్కర్ కళావేదికలో ఈరోజు (శనివారం) జరిగిన పాన్ ఐఐటీ సమ్మిట్‌లో టెక్నాలజీ ఆవిష్కరణలను సీఎం ప్రోత్సహించారు. పాన్ ఐఐటీ సమ్మిట్ జరుగుతున్న ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను సందర్శించారు.
ఆ ప్రాజెక్టును ఏపీలో ఏర్పాటు చేసేలా చూడాలి..
ఆక్సి ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన డ్రోన్‌ను పరిశీలించారు. ఆ సంస్థ ప్రతినిధుల కోరిక మేరకు డ్రోన్‌పై సంతకం చేశారు. అలాగే, వివిధ స్టార్టప్‌లు, ఐఐటీయన్ల నూతన ఆవిష్కరణలను ముఖ్యమంత్రి పరిశీలించారు.పెట్రోలుతో నడిచే టూవీలర్లను గంటల్లో ఈవీలుగా కన్వర్ట్ చేసే సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్‌ను సీఎం చంద్రబాబు సందర్శించారు. సాధారణ వాహనాలను ఈవీలుగా కన్వెర్ట్ చేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టును ఏపీలో ఏర్పాటు చేసేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.
చిన్నారులకు సీఎం అభినందనలు..
ముఖాన్ని స్కాన్ చేసి హెల్త్ రిపోర్టు ఇచ్చే యాప్ తయారు చేసిన సంస్థ స్టాల్‌ను కూడా సందర్శించారు. నిమిషాల వ్యవధిలో ప్రాథమిక రిపోర్టు ఇవ్వగలమని సీఎంకు సదరు సంస్థ ప్రతినిధులు వివరించారు. స్వర్ణాంధ్ర-10 సూత్రాల అమల్లో టెక్నాలజీ వినియోగం ద్వారా సమర్థవంతంగా అమలు చేసే అంశంపై తమ ఐడియాలను ముఖ్యమంత్రికి వివరిస్తూ చిన్నారులు ప్రజెంటేషన్ చేశారు. ఈ సందర్భంగా చిన్నారులను అభినందించారు. చిన్నారులతో కలిసి సీఎం చంద్రబాబు గ్రూప్ ఫొటో దిగారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తయారు చేస్తాం: సీఎం చంద్రబాబు
నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి: అనంత్ అంబానీ
ప్రభుత్వ విద్యాసంస్థలపై నమ్మకాన్ని పెంచుతున్నాం: ఎంపీ శ్రీభరత్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News