రోహిత్ శర్మ సంచలనం.. సచిన్ 22 ఏళ్ల రికార్డు బ్రేక్
ABN , Publish Date - Oct 03 , 2026 | 04:16 PM
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. న్యూ చండీగఢ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో రోహిత్.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. న్యూ చండీగఢ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో రోహిత్.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 22 ఏళ్ల నాటి ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు. వన్డే క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యంత వేగంగా 10,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. ఈ అరుదైన మైలురాయిని రోహిత్ కేవలం 202 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకున్నాడు.
గతంలో సచిన్ టెండూల్కర్ 2004లో ఆస్ట్రేలియాపై బ్రిస్బేన్‌లో ఓపెనర్‌గా 214 ఇన్నింగ్స్‌ల్లో 10వేల పరుగులు సాధించగా, రోహిత్ ఆయనకంటే 12 ఇన్నింగ్స్‌లు ముందే ఈ రికార్డును హిట్ మ్యాన్ తన పేరిట లిఖించుకున్నాడు. ఓపెనర్‌గా 10 వేల పరుగులు చేసిన వారి జాబితాలో సచిన్, క్రిస్ గేల్, సనత్ జయసూర్యల తర్వాత నాలుగో బ్యాటర్‌గా రోహిత్ నిలిచాడు. ఇవాళ వెస్టిండీస్ తో మ్యాచ్ ప్రారంభానికి ముందు రోహిత్ 10 వేల పరుగుల మైలురాయిని చేరడానికి కేవలం 2 పరుగులు మాత్రమే అవసరం ఉంది. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత జేడెన్ సీల్స్ వేసిన మూడో బంతికి ఫ్లిక్ షాట్‌తో రెండు పరుగులు తీసి ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు.
మరోవైపు ఈ సిరీస్‌కు ముందు రోహిత్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. భవిష్యత్తు దృష్ట్యా యశస్వి జైస్వాల్‌ను ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేసినప్పటికీ, రోహిత్ మాత్రం మైదానంలో తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. రెండో వన్డేలో 75 బంతుల్లో 101 పరుగులు సాధించి వన్డేల్లో 12,000 పరుగులు పూర్తి చేసిన మూడో భారతీయుడిగా రోహిత్ నిలిచాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ మరో రికార్డుతో మెరిసి తానెప్పుడూ టీమిండియాకు రియల్ 'హిట్‌మ్యాన్' అని రోహిత్ చాటిచెప్పాడు.
వన్డేలలో అత్యంత వేగంగా 10,000 పరుగులు చేసిన ఆటగాడు
రోహిత్ శర్మ- 202 ఇన్నింగ్స్ VS వెస్టిండీస్, అక్టోబర్ 03, 2026
సచిన్ టెండూల్కర్- 214 ఇన్నింగ్స్ VS ఆస్ట్రేలియా, జనవరి 18, 2004
క్రిస్ గేల్- 268 ఇన్నింగ్స్ VS న్యూజిలాండ్, జూన్22, 2019
సనత్ జయసూర్య- 303 ఇన్నింగ్స్ vsఇంగ్లాండ్, జూన్20, 2006
ఇవి కూడా చదవండి..
శ్రీసిటీలో ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
శ్రీసిటీ బాయిలర్ పేలుడు.. సేఫ్టీ ఆడిట్‌కు పవన్ కల్యాణ్ ఆదేశాలు