Share News

మమత గాయం ఫేక్.. బెంగాల్ సీఎం సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Oct 03 , 2026 | 04:07 PM

2021 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మమతా బెనర్జీ గాయపడిన ఘటనను బెంగాల్ సీఎం గుర్తుచేశారు. ఆ గాయం నకిలీదంటూ ఆయన ఆరోపించారు.

మమత గాయం ఫేక్.. బెంగాల్ సీఎం సంచలన ఆరోపణలు
Suvendu Adhikari and Mamata Banerjee

ఇంటర్నెట్ డెస్క్: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి 2021లో తగిలిన గాయం నకిలీదంటూ పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి సంచలన ఆరోపణలు చేశారు. ‘‘ఆమె గాయానికి సంబంధించిన ఎక్స్‌రే రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. ఆ రిపోర్ట్స్‌లో ‘ఫ్రాక్చర్ లేదు’ అని స్పష్టంగా ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. నిన్న (శుక్రవారం) నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి హసిరాణి తరఫున ప్రచారం చేస్తున్న సమయంలో సువేందు అధికారి ఈ వ్యాఖ్యలు చేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమత గాయపడిన ఘటనను ఆయన గుర్తుచేశారు. కార్ డోర్‌లో కాలు ఇరుక్కుపోయి ఆమెకు స్వల్ప గాయమైందని అన్నారు. అయితే ఆ చిన్న గాయాన్ని మమత పెద్దది చేసి చూపించారని ఆరోపించారు.


2021, మార్చి 10న నందిగ్రామ్‌లో ఎన్నికల ప్రచారం చేస్తూ మమతా బెనర్జీ గాయపడ్డారు. తోపులాట కారణంగా తన కాలు కారు తలుపులో ఇరుక్కుపోయిందని ఆమె తెలిపారు. అనంతరం మమతను అధికారులు ఎస్ఎస్‌కేఎమ్ అనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్లు.. ఆమెకు తీవ్రగాయాలయ్యాయని అప్పట్లో వెల్లడించారు. తరువాత డిశ్చార్జ్ అయిన మమతా బెనర్జీ వీల్‌చైర్‌లోనే ఎన్నికల ప్రచారం కొనసాగించారు. కాగా ఎస్ఎస్‌కేఎమ్ ఆసుపత్రికి వెళ్లి మమత గాయాల రిపోర్ట్ చూశానని, అందులో డాక్టర్లు ‘ఫ్రాక్చర్ లేదు’ అని రాశారని సీఎం సువేందు అధికారి ప్రస్తుతం ఆరోపిస్తున్నారు.


ఈ వార్తలూ చదవండి

దేశవ్యాప్త నిరసనలకు డిజిటల్ వేదిక.. రాహుల్ గాంధీ 'సత్యాగ్రహ'

జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ

Updated Date - Oct 03 , 2026 | 04:13 PM