జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ
ABN , Publish Date - Oct 03 , 2026 | 02:03 PM
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. సీఈసీని జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఆయనను జైల్లో పెట్టే వరకూ దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. సీఈసీని జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఆయనను జైల్లో పెట్టే వరకూ దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం నాటి జంతర్ మంతర్ మార్చ్ లో సుమారు 3 వేల మంది పాల్గొన్నామని డీవైఎఫ్ఐ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ రహీమ్, జనరల్ సెక్రటరీ హిమాఘ్నరాజ్ భట్టాచార్య తెలిపారు.
ఈ సందర్భంగా తమపై పోలీసులు దాడి చేశారని వారు ఆరోపించారు. పోలీసుల దాడిని ఖండించారు. నిన్నటి ప్రదర్శనలో జంతర్ మంతర్ వద్దకు ప్రదర్శనకారులు వెళ్లకుండా పోలీసులు మెట్రోస్టేషన్లు మూసివేశారని, బారికేడ్లు ఏర్పాటు చేసి వేలాది మంది బలగాలతో ఆందోళనకారులను అడ్డుకున్నారని చెప్పారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, బృందా కారత్, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ సహా అన్ని పార్టీల నేతలను అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారని ఆరోపించారు.
ఈనెల 7, 8న దేశవ్యాప్తంగా కాలేజీల్లో ప్రదర్శనలు
ఈనెల 7, 8వ తేదీల్లో ‘ఓటుకు వాయిస్ పేరిట’ దేశవ్యాప్తంగా కాలేజీ క్యాంపస్‌లలో భారత ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా రెఫరెండమ్, సాంస్కృతిక నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని డీవైఎఫ్ఐ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ రహీమ్, జనరల్ సెక్రటరీ హిమాఘ్నరాజ్ భట్టాచార్య తెలిపారు. 9న ‘గుడ్ బై జ్ఞానేశ్’ పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో నిరసనలు, ఆందోళనలు చేస్తామని వారు తెలిపారు. 10 వ తేదీన జంతర్ మంతర్ వేదికగా శాంతి యుత నిరసన చేపడతామని వెల్లడించారు. సీజేపీ సహా అన్ని పార్టీలు ఆ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటాయని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
హనుమాన్ చాలీసా చదివి ధైర్యం తెచ్చుకున్నా..
చంపేస్తున్న ‘సెకండ్ స్మోకింగ్’
మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..