చంపేస్తున్న ‘సెకండ్ స్మోకింగ్’
ABN , Publish Date - Oct 03 , 2026 | 03:10 AM
సిగరేట్ తాగేవారివే కాదు, వారు వదిలిన పొగను పీల్చిన వారి ప్రాణాలూ ఆవిరి అవుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గాలిలోని సిగరేట్ పొగను పీల్చి 2023లో దాదాపు..
2023లో3.2 లక్షల మంది మృతి
న్యూఢిల్లీ, అక్టోబరు 2: సిగరేట్ తాగేవారివే కాదు, వారు వదిలిన పొగను పీల్చిన వారి ప్రాణాలూ ఆవిరి అవుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గాలిలోని సిగరేట్ పొగను పీల్చి 2023లో దాదాపు 3.2 లక్షలమంది మరణించారని చెబుతున్నారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం టొబాకో ఫ్రీ ఇండియా సంస్థ నిర్వహించిన వెబినార్‌లో వైద్య, ఆరోగ్య రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ‘‘సెకండ్ స్మోకింగ్ వల్ల 1990లో 2.17 మంది మరణిస్తే, 2023లో 3.25 లక్షలమంది చనిపోయారు. ఆ ఏడాది మొత్తం 44.4 కోట్లమంది సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ బారిన పడ్డారు’’ అని నీతీ ఆయోగ్ మాజీ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కారణంగా 17 కోట్ల మరణాలు సంభవించాయని పాల్ ఆందోళన వ్యక్తం చేశారు.