Share News

దేశవ్యాప్త నిరసనలకు డిజిటల్ వేదిక.. రాహుల్ గాంధీ 'సత్యాగ్రహ'

ABN , Publish Date - Oct 03 , 2026 | 03:16 PM

దేశంలో వివిధ సమస్యలపై ఒంటరిగా పోరాడుతున్న ప్రజల గొంతుకలను ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 'సత్యాగ్రహ' అనే నూతన డిజిటల్ వేదికను ప్రారంభించారు.

దేశవ్యాప్త నిరసనలకు డిజిటల్ వేదిక.. రాహుల్ గాంధీ 'సత్యాగ్రహ'
Rahul Gandhi Launches Satyagraha Website to Map Protests Across India

ఢిల్లీ, అక్టోబర్ 3: దేశంలో వివిధ సమస్యలపై ఒంటరిగా పోరాడుతున్న ప్రజల గొంతుకలను ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ (శనివారం) 'సత్యాగ్రహ' (Satyagraha) అనే నూతన డిజిటల్ వేదికను ప్రారంభించారు. మహాత్మా గాంధీ 157వ జయంతి ముగిసిన మరుసటి రోజే, ఆయన అహింసాత్మక పోరాట సిద్ధాంతం స్ఫూర్తితో రూపొందించిన ఈ ప్లాట్‌ఫారమ్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.


డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ప్రధాన లక్ష్యం

దేశంలోని విభిన్న ప్రాంతాల్లో జరుగుతున్న సమస్యల నిరసనలను, ఉద్యమాలను ఒక ఇంటరాక్టివ్ మ్యాప్ (Interactive Map) ద్వారా ఒకే చోట అనుసంధానించడమే ఈ వెబ్‌సైట్ ప్రధాన ఉద్దేశం. ఒకే తరహా సమస్యలపై వేర్వేరు ప్రదేశాల్లో పోరాడుతున్న వ్యక్తులు, సంఘాలు ఒకరినొకరు గుర్తించి మద్దతు తెలుపుకోవడానికి ఇది సహాయపడుతుంది.

'దేశంలో సత్యం, న్యాయం అణచివేతకు గురవుతున్న ప్రతి చోటా ప్రజలకు అండగా నిలవడం ప్రతిపక్ష నాయకుడిగా నా బాధ్యత' అని రాహుల్ గాంధీ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. వీధిపోరాటాల నుంచి పార్లమెంట్ వరకు, అలాగే లేఖల ద్వారా బాధితులకు మద్దతుగా నిలుస్తానని ఆయన హామీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి..

శ్రీసిటీలో ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

శ్రీసిటీ బాయిలర్ పేలుడు.. సేఫ్టీ ఆడిట్‌కు పవన్ కల్యాణ్ ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 03 , 2026 | 03:42 PM