Share News

ఎలాన్ మస్క్‌తో బంధం ముగిసింది: శివోన్ జిలిస్ సంచలన ప్రకటన..

ABN , Publish Date - Oct 03 , 2026 | 04:15 PM

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వ్యక్తిగత జీవితంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనతో ఐదేళ్లకు పైగా కలిసి ఉన్న శివోన్ జిలిస్ తమ బంధం ముగిసినట్లు ప్రకటించారు.

ఎలాన్ మస్క్‌తో బంధం ముగిసింది: శివోన్ జిలిస్ సంచలన ప్రకటన..
Elon Musk breakup

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వ్యక్తిగత జీవితంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనతో ఐదేళ్లకు పైగా కలిసి ఉన్న శివోన్ జిలిస్ తమ బంధం ముగిసినట్లు ప్రకటించారు. ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండానే మస్క్ తమ సంబంధానికి ముగింపు పలికారని ఆమె వెల్లడించారు. వీరిద్దరికీ నలుగురు పిల్లలు ఉన్నారు. తాజాగా జిలిస్ చేసిన ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది (Elon Musk breakup).


తమ బంధం ఇంత అకస్మాత్తుగా ముగుస్తుందని ఊహించలేదని జిలిస్ ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 24న మస్క్‌తో జరిగిన వ్యక్తిగత సందేశాల సంభాషణను కూడా జిలిస్ బయటపెట్టారు. ఆ రోజు ఇద్దరూ అల్పాహారం సందర్భంగా కలుసుకున్నట్టు, అనంతరం ఒకరిపై మరొకరు ప్రేమను వ్యక్తం చేసుకున్నట్టు ఆ సందేశాలు వెల్లడిస్తున్నాయి. అయితే వారం వ్యవధిలోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది (Shivon Zilis Elon Musk relationship).


మస్క్ క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ప్రేమ, ప్రశాంతత అందించేందుకు తాను ప్రయత్నించినట్లు జిలిస్ తెలిపారు. తనతోపాటు పిల్లలు కూడా మస్క్‌కు మానసికంగా ప్రశాంతత లభించే కుటుంబ వాతావరణాన్ని అందించామన్నారు. విడిపోవడం బాధ కలిగిస్తున్నప్పటికీ మస్క్ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఇద్దరూ మంచి స్నేహితులుగా కొనసాగడంతోపాటు పిల్లల సంరక్షణ బాధ్యతలను కలిసి నిర్వర్తించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు (Elon Musk Shivon Zilis split).


భారత సంతతికి చెందిన శివోన్ జిలిస్ కెనడాలో జన్మించారు. ప్రస్తుతం మస్క్‌కు చెందిన న్యూరాలింక్ సంస్థలో జిలిస్ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2020లో మస్క్‌తో ఆమెకు వ్యక్తిగత అనుబంధం ఏర్పడింది. అప్పటి నుంచి వృత్తిపరంగానూ, వ్యక్తిగతంగానూ ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం మొదలైంది. మస్క్, జిలిస్‌లకు నలుగురు పిల్లలు ఉన్నారు. 2021లో కవలలు స్ట్రైడర్, అజూర్ జన్మించారు. అనంతరం 2024లో కుమార్తె ఆర్కేడియా, 2025లో కుమారుడు సెల్డన్ జన్మించారు.


ఇవి కూడా చదవండి..

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. లీటర్‌కు రూ.5, రూ.3 పెంచిన నయారా ఎనర్జీ


కొడుకును మార్చాలనుకుంది.. చివరకు తానే మారిపోయింది.. ఈ చైనా మహిళ కథేంటంటే..

Updated Date - Oct 03 , 2026 | 04:24 PM