Share News

ఏపీ మీదుగా మరో వందేభారత్‌ స్లీపర్‌‌.. హాల్ట్స్ ఇవే?

ABN , Publish Date - Oct 02 , 2026 | 06:51 PM

ముంబై-బెంగళూరు మధ్య ప్రయాణించే ప్యాసింజర్స్‌కు రైల్వే శాఖ తరఫున గుడ్‌న్యూస్‌. సుదూర ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చే వందేభారత్‌ స్లీపర్‌ రైలు.. ఈ మార్గంలో త్వరలో పరుగులు పెట్టనుంది. దసరా నాటికి ఈ రైలు సేవలు ప్రారంభమయ్యే అవకాశముండటంతో.. ఏపీ ప్రయాణికుల్లోనూ ఆసక్తి నెలకొంది.

ఏపీ మీదుగా మరో వందేభారత్‌ స్లీపర్‌‌.. హాల్ట్స్ ఇవే?
Vande Bharat Sleeper Train

ఇంటర్నట్ డెస్క్: సౌకర్యవంతమైన రైలు ప్రయాణాన్ని అందించేందుకు వందేభారత్‌ స్లీపర్‌ సేవలు మరో మార్గంలో అందుబాటులోకి రానున్నాయి. సుదూర ప్రాంతాలకు పయనించే వారికోసం.. ముంబై-బెంగళూరు మధ్య రెండో వందేభారత్‌ స్లీపర్‌ రైలును నడిపేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. దసరా నాటికి ఈ రైలు సేవలు ప్రారంభమయ్యే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రారంభ తేదీ వివరాలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


ఈ రైలు వారంలో 6 రోజులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. బెంగళూరు నుంచి సోమవారం, ముంబై నుంచి మంగళవారం రైలు సేవలు ఉండవు. బెంగళూరులో రోజూ రాత్రి 10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1:50 గంటలకు ముంబైకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో భాగంగా ముంబైలో రాత్రి 10:30 గంటలకు స్టార్ట్ అయి, మర్నాడు మధ్యాహ్నం 2:50 గంటలకు బెంగళూరు చేరుతుంది.


ఏపీలో రెండు స్టేషన్లలో హాల్ట్‌

ముంబై-బెంగళూరు మార్గంలో నడిచే ఈ స్లీపర్‌ ట్రైన్.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, గుంతకల్లు స్టేషన్లలో ఆగనుంది. ఆ తర్వాత.. రాయచూర్‌, కాలబురగి, సోలాపూర్‌, పుణె, కల్యాణ్‌ స్టేషన్లలోనూ హాల్ట్‌ ఉంటుంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య నడిచే ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌కు దాదాపు 22 గంటల సమయం పడుతుండగా.. కొత్తగా రానున్న వందేభారత్‌ స్లీపర్‌తో కేవలం 16 గంటలతో ప్రయాణ నిడివి గణనీయంగా తగ్గనుంది.


ఇవీ చదవండి:

‘ఫ్లైయింగ్‌ అతడికి భార్య లాంటిది’.. స్మిత్ సాహసంపై తండ్రి భావోద్వేగ స్పందన

నమో భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ట్రిప్ పాస్‌తో 10 శాతం వరకు డిస్కౌంట్

Updated Date - Oct 02 , 2026 | 07:39 PM